Anger Tales in Disney Plus Hotstar: మరో తెలుగు వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈసారి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ కొత్త సిరీస్‌ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా సోమవారం (జనవరి 9) రిలీజ్ చేసింది. ఈ కొత్త వెబ్ సిరీస్ పేరు యాంగర్ టేల్స్ (Anger Tales). నలుగురు వ్యక్తుల కథే ఈ సిరీస్.,సోమవారం రిలీజ్ చేసిన టీజర్‌లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం సిరీస్‌లోని క్యారెక్టర్స్‌ను మాత్రమే పరిచయం చేశారు. రంగ (వెంకటేశ్ మహా), పూజా (మడోన్నా సెబాస్టియన్), రాధా (బింధు మాధవి), గిరి (ఫణి ఆచార్య) అనే నలుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సిరీస్‌లో ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తోపాటు సుహాస్, రవీంద్ర విజయ్‌లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.,డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమ్ కానుంది. అయితే ఈ టీజర్ ద్వారా అసలు స్టోరీ ఏంటనేది మాత్రం హాట్‌స్టార్ రివీల్ చేయలేదు. అయితే టీజర్ మాత్రం అన్ని రకాల ఎమోషన్స్‌తో ఆసక్తికరంగా సాగింది. ఈ సిరీస్‌కు కళాకారుడు ఫేమ్ ప్రభాస్ తిలక్ రైటర్, డైరెక్టర్. ఇక ఈ సిరీస్‌ను శ్రీధర్ రెడ్డి, నటుడు సుహాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.,