Disney+ Hotstar Dolby Atmos Experience: ఈ ఓటీటీలో హెడ్‌ఫోన్స్‌తో డాల్బీ అట్మాస్ ఎక్స్‌పీరియన్స్‌-disney hotstar to give its users dolby atmos experience with headphones
Telugu News  /  Entertainment  /  Disney Hotstar To Give Its Users Dolby Atmos Experience With Headphones
డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ
డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ (MINT_PRINT)

Disney+ Hotstar Dolby Atmos Experience: ఈ ఓటీటీలో హెడ్‌ఫోన్స్‌తో డాల్బీ అట్మాస్ ఎక్స్‌పీరియన్స్‌

15 September 2022, 16:27 ISTHT Telugu Desk
15 September 2022, 16:27 IST

Disney+ Hotstar Dolby Atmos Experience: హెడ్‌ఫోన్స్‌తో డాల్బీ అట్మాస్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తోంది డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ. దీంతో యూజర్స్‌ ఓ కొత్త అనుభూతిని పొందే వీలుంటుంది.

Disney+ Hotstar Dolby Atmos Experience: డిస్నీ+హాట్‌స్టార్‌, డాల్బీ లేబొరేటరీస్‌ కలిసి యూజర్స్‌కు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ ఓటీటీలో యూజర్స్‌కు డాల్బీ అట్మాస్ అనుభూతిని అందించనున్నారు. ఇప్పటికే ఈ డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ తమ యూజర్లకు డాల్బీ విజన్‌ సపోర్ట్‌ కూడా అందించింది.

ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి డాల్బీ అట్మాస్‌ ప్లేబ్యాక్‌ను అందించనుంది. టీవీలు, ఏవీఆర్‌లు, సౌండ్‌బార్‌లు, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు, ఐఓఎస్‌ డివైస్‌లన్నింటిలోనూ ఈ కొత్త డాల్బీ అట్మాస్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందవచ్చు. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకునే యూజర్లు ఈ సౌండ్‌తో మూవీస్‌, వెబ్‌సిరీస్‌ను థియేటర్‌ లెవల్లో ఎంజాయ్ చేసే వీలుంటుంది.

తమ ప్లాట్‌ఫామ్‌పై యూజర్లకు డాల్బీ అట్మాస్‌ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు అందించడంపై డిస్నీ స్ట్రీమింగ్‌ డెవలపింగ్‌ మార్కెట్స్‌ ప్రోడక్ట్ హెడ్‌ సిద్‌ మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. డాల్బీతో తమ అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్తులో యూజర్లకు మరింత ఆధునిక ఆవిష్కరణలను అందించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లోని కొన్ని షోలను ఈ డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్‌ ఎక్స్‌పీరియన్స్‌తో చూసే వీలుంది. ఈ షోలలో హోమ్‌ శాంతి, రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌, నవంబర్‌ స్టోరీ, హ్యూమన్‌, గ్రహణ్‌, ది గ్రేట్‌ ఇండియన్‌ మర్డర్‌, ఆర్య, శూర్‌వీర్‌, మాసూమ్‌, ఘర్‌ వాప్సీ, ఔట్‌ ఆఫ్‌ లవ్, స్పెషల్‌ ఓపీఎస్‌ 1.5, విక్రమ్‌, ఎ థర్స్‌డేలాంటి వెబ్‌సిరీస్, సినిమాలు ఉన్నాయి.

టాపిక్