Thomson 4K QLED TVs । సరసమైన ధరలోనే డాల్బీ విజన్ అందించే థామ్సన్ QLED టీవీలు!-thomson 4k qled tv series launched check price and other details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Thomson 4k Qled Tv Series Launched, Check Price And Other Details

Thomson 4K QLED TVs । సరసమైన ధరలోనే డాల్బీ విజన్ అందించే థామ్సన్ QLED టీవీలు!

HT Telugu Desk HT Telugu
Sep 12, 2022 12:57 PM IST

థామ్సన్ కంపెనీ మూడు స్మార్ట్ టీవీలను (Thomson 4K QLED TVs) భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలు రూ. 34 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మిగతా వివరాలు చూడండి.

Thomson 4K QLED TVs
Thomson 4K QLED TVs

ఫ్రెంచ్‌కు చెందిన గృహోపకరణాల బ్రాండ్ థామ్సన్ భారత మార్కెట్లో తాజాగా మూడు కొత్త QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. Google TV ద్వారా ఆధారితమైన ఈ సరికొత్త QLED TV సిరీస్, మూడు స్క్రీన్ పరిమాణాలలో వస్తుంది. ఇందులో భాగంగా బేస్ మోడల్ 50-అంగుళాలు , మీడియం రేంజ్ 55-అంగుళాలు అలాగే టాప్-స్పెక్ మోడల్ టీవీ 65-అంగుళాల స్క్రీన్ పరిమాణంతో వచ్చింది. అలాగే ఈ మూడు కూడా Google అసిస్టెంట్- టీవీ రిమోట్, చైల్డ్ లాక్ఫీచర్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసే రెండు 20W స్పీకర్లను కలిగి ఉన్నాయి.

ఈ QLED టీవీలన్నీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అదే స్థాయి OLED టీవీల కంటే చాలా సరసమైనవి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ టీవీలు Android TV OSకి బదులుగా Google TV OSలో రన్ అవుతాయి. వీటి ధరలు రూ. 34 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.

మిడ్-రేంజ్ బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు థామ్సన్ స్మార్ట్ టీవీలు అత్యుత్తమ సాంకేతికత, డిజైన్‌ను కలిగి అగ్రశ్రేణి ఫీచర్లను అందించగలవు.

Thomson 4K QLED TVs ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 4K వీడియో క్వాలిటీ అందించే 32/55/60అంగుళాల స్క్రీన్
  • 2 GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్
  • MT9062 ప్రాసెసర్‌
  • Google TV OS
  • డాల్బీ ఆడియో, డాల్బీ విజన్ (HDR 10+, Dolby Atmos, Dolby Digital Plus, DTS Trusurround, 40W డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్ స్పీకర్‌)
  • డ్యూయల్-బ్యాండ్ Wi-Fi
  • Google అసిస్టెంట్- టీవీ రిమోట్

Thomson 4K QLED TVs ధరలు:

థామ్సన్ QLED 50-అంగుళాల మోడల్ (Q50H1000) ధర రూ. 33,999/-

55-అంగుళాల వేరియంట్ (Q55H1001) ధర రూ. 40,999/-

65-అంగుళాల (Q65H1100) ధర రూ. 59,999/-

ఈ మూడు వేరియంట్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ టీవీలు సింగిల్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో లభ్యమవుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం