Xiaomi Smart TV X Series । డాల్బీ సౌండ్, 4K రిజల్యూషన్‌తో వచ్చిన షావోమి టీవీలు!-xiaomi smart tv x series launched check prices specs other details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Xiaomi Smart Tv X Series Launched, Check Prices, Specs Other Details

Xiaomi Smart TV X Series । డాల్బీ సౌండ్, 4K రిజల్యూషన్‌తో వచ్చిన షావోమి టీవీలు!

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 09:41 PM IST

షావోమి నుంచి Xiaomi Smart TV X విడుదలైంది. ఇందులో మూడు స్మార్ట్ టీవీ మోడల్స్ ఉన్నాయి. ధరలు రూ. 29 వేల నుంచి ప్రారంభమతున్నాయి.

Xiaomi Smart TV X series
Xiaomi Smart TV X series

షావోమి కంపెనీ భారత మార్కెట్లో తమ స్మార్ట్ టీవీ లైనప్‌ను మరింత విస్తరించింది. సరసమైన ధరల్లో Xiaomi Smart TV X సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు స్క్రీన్ సైజు మోడల్‌ టెలివిజన్లు అందుబాటులో ఉంటాయి. బేస్ వేరియంట్ 43 అంగుళాల స్క్రీన్ సైజ్ కలిగి ఉండగా, మిడ్- వేరియంట్లో 50 అంగుళాలు, టాప్-స్పెక్ మోడల్ 55-అంగుళాలతో వచ్చింది. ఈ మూడు టీవీలు 4K రిజల్యూషన్ అలాగే డాల్బీ విజన్ ప్లేబ్యాక్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. Xiaomi Smart TV X సిరీస్ ధర రూ. 28,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి సెప్టెంబర్ 14 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి.

Xiaomi Smart TV X సిరీస్ టీవీలు వివిడ్ పిక్చర్ ఇంజిన్ సాంకేతికతతో అసాధారణమైన రంగులను ప్రదర్శిస్తాయి. 94 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్ కవరేజీతో 1.07 బిలియన్ రంగులను చూపగలవని షావోమి కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా వీటిలో డాల్బీ విజన్, హెచ్‌డిఆర్10, హెచ్‌ఎల్‌జి వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ టీవీల్లో DTS-HD వర్చువల్ X సాంకేతికత కలిగిన 30W డాల్బీ ఆడియో స్పీకర్లు థియేటర్ క్వాలిటీ సౌండ్ అందిస్తాయి. అటు వీడియో పరంగా, ఇటు ఆడియో పరంగానూ మెరుగైన ఫీచర్లు కలిగిన ఈ టీవీల్లో విజువల్స్ చూస్తుంటే లీనమైపోతారు.

ఇంకా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఈ కింద పరిశీలించండి.

Xiaomi Smart TV X సిరీస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 4K రిజల్యూషన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్, 43"/50"/55" స్క్రీన్ సైజ్
  • 2GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్
  • క్వాడ్-కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిట్ TV 10 ఓఎస్
  • 30W స్పీకర్, డాల్బీ ఆడియో, DTS:X టెక్నాలజీ
  • PatchWall UI కంటెంట్ అగ్రిగేటర్

కనెక్టివిటీపరంగా 3 HDMI 2.1 పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, ఈథర్నెట్, AV , హెడ్‌ఫోన్ జాక్‌, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi , బ్లూటూత్ 5.0. "OK Google" వాయిస్ అసిస్టెంట్, ఇంటర్నల్ Chromecast సపోర్ట్ ఉన్నాయి.

ధరలు: Xiaomi Smart TV X43 (50-అంగుళాలు) టీవీ ధర, రూ. 28,999/-

Xiaomi Smart TV X50 (50-అంగుళాలు) టీవీ ధర, రూ. 34,999/-

Xiaomi Smart TV X55 (55-అంగుళాలు) టీవీ ధర, రూ.39,999/-

ఈ టీవీలు సెప్టెంబర్ 14, 2022 నుంచి Mi.com, Mi Homes, Flipkart అలాగే ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్