Xiaomi Smart TV 5A Pro । తక్కువ ధరకే డాల్బీ ఆడియో సౌండ్ కలిగిన స్మార్ట్ టీవీ!-xiaomi smart tv 5a pro smart tv launched at rs 16999 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Xiaomi Smart Tv 5a Pro Smart Tv Launched At <Span Class='webrupee'>₹</span>16,999

Xiaomi Smart TV 5A Pro । తక్కువ ధరకే డాల్బీ ఆడియో సౌండ్ కలిగిన స్మార్ట్ టీవీ!

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 03:26 PM IST

షావోమి కంపెనీ నుంచి బడ్జెట్ ధరలో Xiaomi Smart TV 5A Pro అనే స్మార్ట్ టీవీ విడుదలైంది. ఇది డీటీఎస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. దీనిలోని ఫీచర్లు, ధర, ఇతర వివరాలు తెలుసుకోండి.

Xiaomi Smart TV 5A Pro
Xiaomi Smart TV 5A Pro

షావోమి కంపెనీ తమ 5A సిరీస్ టీవీ లైనప్‌లో మరొక సరికొత్త స్మార్ట్ టీవీని చేర్చింది. భారత మార్కెట్లో Xiaomi Smart TV 5A Pro పేరుతో విడుదలైన ఈ టీవీ Xiaomi TV 5A సిరీస్‌లోనే మెరుగైన వెర్షన్ టీవీగా కంపెనీ పేర్కొంది. అంతేకాదు ఈ టీవీ అందుబాటు ధరలోనే లభించనుంది. 32 అంగుళాల స్క్రీన్ సైజులో, ఏకైక వేరియంట్లో విడుదలైన ఈ Xiaomi Smart TV 5A Pro ధరను రూ. 16,999గా నిర్ణయించారు. ఇది అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన షావోమి స్మార్ట్ టీవీ 5ఏకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని Xiaomi ఇండియా సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ సుదీప్ సాహు తెలిపారు. Xiaomi Smart TV 5A Pro టీవీ కూడా వినియోగదారులకు గొప్ప వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ టీవీ ఎంతో సొగసైన డిజైన్‌ను కలిగి ఉండి, శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Xiaomi Smart TV 5A Proలోని ప్రత్యేకతలను పరిశీలిస్తే. ఈ టీవీ ప్రీమియం మెటాలిక్ కేసింగ్ డిజైన్ కలిగి ఉంది. 1366 x 768p రెసల్యూషన్ కలిగిన డిస్‌ప్లేతో వచ్చింది. ఇన్-బిల్ట్ Patchwall తాజా వెర్షన్‌లో రన్ అవుతుంది. వినియోగదారులు 15+ భాషలలో కంటెంట్‌ని బ్రౌజ్ చేయవచ్చు.

ఈ టీవీ డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేసే 24W సామర్థ్యం కలిగిన రెండు స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ సౌండ్‌ స్పీకర్లతో అత్యుత్తమ సరౌండ్ సౌండ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ టీవీ కాబట్టి “OK Google” వాయిస్ అసిస్టెన్స్, Chromecast అంతర్నిర్మిత సపోర్ట్ కూడా లభిస్తుంది.

Xiaomi Smart TV 5A Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన జెల్-లెస్ HD-రెడీ 32-అంగుళాల స్క్రీన్
  • ALLM లేదా ఆటో లో- లేటెన్సీ మోడ్
  • 1.5GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్
  • Quad Core Cortex A55 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిట్ TV 11 ఓఎస్
  • డాల్బీ ఆడియో, DTS:X టెక్నాలజీ

చిన్న గదులకు ఈ టీవీ బాగా సరిపోతుంది. ఇంకా దీని రిమోట్ కంట్రోల్‌లో క్విక్ మ్యూట్, క్విక్ వేక్, క్విక్ సెట్టింగ్‌లు సహా అనే ఫంక్షనింగ్ బటన్‌లు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్