Amazon Prime Video Subscription Plans: ప్రైమ్‌ వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌, బెనిఫిట్స్‌ ఇవే-amazon prime video subscription plans and benefits in detail ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amazon Prime Video Subscription Plans And Benefits In Detail

Amazon Prime Video Subscription Plans: ప్రైమ్‌ వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌, బెనిఫిట్స్‌ ఇవే

Hari Prasad S HT Telugu
Sep 02, 2022 02:53 PM IST

Amazon Prime Video Subscription Plans: ప్రైమ్‌ వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌, బెనిఫిట్స్‌ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ప్రైమ్‌ వీడియోలో ఉన్న ప్లాన్స్‌ ఏవో తెలుసుకోండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియో (REUTERS)

Amazon Prime Video Subscription Plans: ఇదంతా ఓటీటీ యుగం కదా. అందరి ఇళ్లలోనూ స్మార్ట్‌టీవీలు వచ్చేస్తున్న తర్వాత నెలవారీ కేబుల్‌ కనెక్షన్‌ కంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లే ఎక్కువగా అవుతున్నాయి. ఈ ఓటీటీల్లోనూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో చాలా స్పెషల్‌. ఈ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడటమే కాదు.. ప్రైమ్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ షాపింగ్‌ యాప్‌లలోనూ ఎన్నో బెనిఫిట్స్‌ ఉంటాయి.

నిజానికి ఇండియాలో చాలా పాపులర్‌ మెంబర్‌షిప్‌లలో ఈ అమెజాన్‌ ప్రైమ్‌ అన్నింటి కన్నా ముందు ఉంటుంది. మరి ఇందులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్స్‌ ఏంటి? వాటి వల్ల కలిగే బెనిఫిట్స్‌ ఏంటి? ఈ ప్రైమ్‌ వీడియోను ఫ్రీగా అందించే మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్లాన్స్‌ ఏంటో కూడా చూద్దాం.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ 2022

అమెజాన్‌ ప్రస్తుతం మూడు ప్లాన్స్‌ అందిస్తోంది. నెలవారీగా లేదంటే మూడు నెలలకు లేదా ఏడాదికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు. ఈ ప్లాన్స్‌లో వాలిడిటీ తప్ప బెనిఫిట్స్‌ అన్నీ ఒకేలా ఉండటమే దీని ప్రత్యేకత.

నెలవారీ అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ - రూ.179

క్వార్టర్లీ అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ - రూ.459

ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌- రూ.1499

ఈ సబ్‌స్క్రిప్షన్‌ బెనిఫిట్స్‌ ఏంటి?

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌తో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. వీటిలో ఏ ప్లాన్‌ ఎంచుకున్నా.. ఒకే రకమైన బెనిఫిట్స్‌ ఉంటాయి. అంటే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడొచ్చు. ప్రైమ్‌ మ్యూజిక్‌లో పాటలు వినొచ్చు. ఇక అమెజాన్‌ షాపింగ్‌ సైట్‌, యాప్‌లలో ఫ్రీ డెలివరీలు, ఎర్లీ సేల్స్‌ యాక్సెస్‌, స్పెషల్‌ డిస్కౌంట్లు వంటి ఎన్నో ప్రయోజాలు ఉంటాయి.

నెలవారీ ప్లాన్‌ తీసుకుంటే ప్రతి నెలా రూ.179 చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ రెనివల్‌ చేసుకోవాలి. అదే మూడు నెలల ప్లాన్‌ ఒకేసారి తీసుకుంటే మీకు రూ.78 ఆదా అవుతుంది. ఇక ఏడాది ప్లాన్‌ తీసుకుంటే నెలవారీతో పోలిస్తే రూ.649, క్వార్టర్లీ ప్లాన్‌తో పోలిస్తే రూ.337 వరకూ ఆదా అవుతుంది. ఒక రకంగా ఏడాది ప్లాన్‌ చాలా బెస్ట్‌ అని చెప్పొచ్చు. ప్రైమ్‌ వీడియోను ఎన్ని డివైస్‌లలో అయినా లాగిన్‌ చేసే వీలుండటం మరో ప్రత్యేకత.

మొబైల్‌ రీఛార్జ్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కొన్ని మొబైల్‌ ప్లాన్స్‌తో ఫ్రీగా పొందే అవకాశం కూడా ఉంది. ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ఐడియా ఇలా అన్ని ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌లు తమ ప్లాన్స్‌లో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నాయి.

ఎయిర్‌టెల్‌లో అయితే..

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లయితే.. రూ.108, రూ.359, రూ.699, రూ.999 ప్లాన్స్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు. వీటిలో రూ.108, రూ.359 ప్లాన్స్‌లో ప్రైమ్‌ మొబైల్‌ ఓన్లీ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అదే రూ.699 ప్లాన్‌తో 54 రోజుల పాటు, రూ.999 ప్లాన్‌తో 84 రోజులు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ పొందవచ్చు.

ఇక ఎయిర్‌టెల్‌ పోస్ట్‌ పెయిడ్‌ అయితే రూ.499, రూ.999, రూ.1199, రూ.1599 ప్లాన్స్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కూడా ఉంటుంది.

వొడాఫోన్‌ ఐడియా అయితే..

వొడాఫోన్‌ ఐడియా పోస్ట్ పెయిడ్‌ ప్లాన్స్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ అందిస్తోంది. నెలవారీ రూ.499, రూ.699, రూ.1066 ప్లాన్స్‌లో ఈ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు. ఈ ప్లాన్స్‌ అన్నింటిలోనూ ఏడాది ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉచితంగా పొందే వీలుంటుంది.

జియో అయితే..

రిలయెన్స్‌ జియో కూడా పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌లో ఈ అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా ఇస్తోంది. రూ.399, 599, 799, 999, 1499 ప్లాన్స్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా పొందే వీలుంది.

IPL_Entry_Point

టాపిక్