Netflix OTT Subscription Plans: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌.. చీపెస్ట్‌ ప్లాన్‌ ఇదే-netflix ott subscription plans and mobile plans which offer them for free ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott Subscription Plans: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌.. చీపెస్ట్‌ ప్లాన్‌ ఇదే

Netflix OTT Subscription Plans: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌.. చీపెస్ట్‌ ప్లాన్‌ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 07, 2022 08:04 PM IST

Netflix OTT Subscription Plans: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కోసం చూస్తున్నారా? అయితే ఏఏ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి? అందులో అతి తక్కువ ధర ప్లాన్‌ ఏది వంటి వివరాలు మీకోసం.

<p>నెట్‌ఫ్లిక్స్‌</p>
నెట్‌ఫ్లిక్స్‌ (REUTERS)

Netflix OTT Subscription Plans: గ్లోబల్‌ ఓటీటీల్లో మంచి పాపులారిటీ ఉన్నది నెట్‌ఫ్లిక్స్‌కే. హాలీవుడ్‌ రేంజ్‌లో భారీ బడ్జెట్‌ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లను ఈ ఓటీటీ నిర్మిస్తోంది. అయితే అదే రేంజ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ధరలు ఉండటంతో చాలా మంది ఈ ఓటీటీకి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలాంటి దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను భరించడం చాలా మందికి సాధ్యం కాదు.

అందుకే ఈ ఏడాది లక్షల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను నెట్‌ఫ్లిక్స్‌ కోల్పోయింది. దీంతో ఆ కోల్పోయిన సబ్‌స్క్రైబర్లను తిరిగి పొందేందుకు ఈ మధ్య యాడ్‌-సపోర్టెడ్‌ తక్కువ ధర ప్లాన్స్‌ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ కొత్త ప్లాన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌లాంటి ఓటీటీల నుంచి నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.

దీంతో తక్కువ ధర ప్లాన్‌ను తీసుకురావడం తప్ప మరో దారి కనిపించని పరిస్థితి. దీనికోసం ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తోనూ నెట్‌ఫ్లిక్స్‌ చేతులు కలిపింది. అయితే తక్కువ ధర అంటే ఎంత అన్నది మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ప్లాన్స్‌ ఏంటో ఒకసారి చూద్దాం.ఇప్పుడున్న వాటిలో నెలవారీగా రూ.149 అత్యంత తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్‌ కాగా.. రూ.649 అత్యంత ఖరీదైనది.

నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్స్‌ ఇవే

రూ.149 మొబైల్‌ ప్లాన్‌: ఇది చీపెస్ట్‌ మంత్లీ ప్లాన్‌. దీనికి సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ను మొబైల్‌ డివైస్‌లో చూసే అవకాశం ఉంటుంది. మొబైల్‌ లేదా ట్యాబ్‌లో 480 పిక్సెల్‌ క్వాలిటీతో మూవీస్‌, వెబ్‌సిరీస్‌ స్ట్రీమ్‌ అవుతాయి. ఒకసారి ఒక డివైస్‌లో మాత్రమే స్ట్రీమ్‌ అవుతుంది. ఇక ఇదే ఏడాది ప్లాన్‌ తీసుకుంటే రూ.1788 చెల్లించాల్సి ఉంటుంది.

రూ.199 బేసిక్‌ ప్లాన్‌: ఇది నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌. అయితే దీనిని ఫోన్‌తోపాటు టాబ్లెట్‌, కంప్యూటర్‌, టీవీల్లోనూ చూసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఒక డివైస్‌కే యాక్సెస్‌ ఉంటుంది. ఏడాదికి కావాలంటే రూ.2388 చెల్లించాలి.

రూ.499 స్టాండర్డ్‌ ప్లాన్‌: ఇది స్టాండర్డ్‌ ప్లాన్‌. ఫోన్‌, ట్యాబ్లెట్‌, కంప్యూటర్‌ లేదా టీవీలో చూసుకోవచ్చు. ఈ ప్లాన్‌ తీసుకుంటే ఒకేసారి రెండు డివైస్‌లలో స్ట్రీమ్‌ చేసుకునే వీలుంటుంది. ఈ ప్లాన్‌ ఏడాదికి కావాలంటే రూ.5988 చెల్లించాలి.

రూ.649 ప్రీమియం ప్లాన్‌: ఇది నెట్‌ఫ్లిక్స్‌ ప్రీమియం ప్లాన్‌. ఇందులో 4కే హెడ్‌డీఆర్‌ క్వాలిటీతో చూసే అవకాశం ఉంటుంది. ఒకేసారి నాలుగు డివైస్‌లలో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ ప్లాన్స్‌లో ఇదే చాలా ఖరీదైనది. ఏడాది ప్లాన్‌ కావాలంటే రూ.7788 చెల్లించాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ అందించే మొబైల్‌ ప్లాన్స్‌

నెట్‌ఫ్లిక్స్‌కు నేరుగా సబ్‌స్క్రైబ్‌ చేసుకోకపోయినా.. కొన్ని మొబైల్‌ ప్లాన్స్‌ ద్వారా ఈ ఓటీటీ పొందొచ్చు. జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ అయిన రూ.399, రూ.599, రూ.799 రూ.999, రూ.1499 ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ వస్తోంది. ఈ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ రూ.149 మొబైల్‌ ప్లాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

ఇక VI పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లయితే.. నెలవారీ రూ.1099 ప్లాన్‌ తీసుకున్న వాళ్లకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా వస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో రూ.499 స్టాండర్డ్‌ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. దీనిద్వారా రెండు డివైస్‌లలో ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌ ఫుల్‌హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్‌ చేసుకోవచ్చు.

జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌తోనూ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్లు వస్తాయి. జియో ఫైబర్‌ నెలవారీ రూ.1499 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌, రూ.2499, రూ.3999తో బేసిక్‌ ప్లాన్‌, రూ.8499తో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీగా వస్తాయి.

ఇక టాటా ప్లే డీటీహెచ్‌ సర్వీస్‌తోనూ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో నెలవారీ రూ.849 నుంచి రూ. 1249 వరకూ ఉన్నాయి. టాటా ప్లే బింజ్‌ కాంబో నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్స్‌ పేరుతో ఇవి ఉంటాయి.

Whats_app_banner