Akshay Kumar: అక్ష‌య్‌ ఖాతాలో చెత్త రికార్డు - ఓటీటీలో త‌క్కువ వ్యూస్ వచ్చిన సినిమా ఇదే-akshay kumar cutt putli least watched hindi film on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Akshay Kumar Cutt Putli Least Watched Hindi Film On Disney Plus Hotstar

Akshay Kumar: అక్ష‌య్‌ ఖాతాలో చెత్త రికార్డు - ఓటీటీలో త‌క్కువ వ్యూస్ వచ్చిన సినిమా ఇదే

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 10:31 AM IST

Akshay Kumar: అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన క‌ట్‌పుట్లి సినిమా సెప్టెంబ‌ర్ 2న డైరెక్ట్‌గా డిస్నీప్ల‌స్‌హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది. ఓటీటీలో ఈ సినిమా ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న‌ది. ఆ రికార్డ్ ఏదంటే...

అక్ష‌య్‌కుమార్
అక్ష‌య్‌కుమార్ (twitter)

Akshay Kumar: అక్ష‌య్ కుమార్ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ అనే న‌మ్మ‌కం ఉండేది. అత‌డు న‌టించిన ప్ర‌తి సినిమా వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం సాధార‌ణ‌మైపోయింది. కానీ క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం త‌ల‌క్రిందులైంది. ఈ ఏడాది అక్ష‌య్ న‌టించిన , బ‌చ్చ‌న్ పాండే, పృథ్వీరాజ్‌, ర‌క్షాభంద‌న్ సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి. యాభై కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ట్రెండింగ్ వార్తలు

వెండిత‌ర‌పైనే కాదు ఓటీటీలోనూ అక్ష‌య్‌కుమార్‌కు నిరాశే మిగిలింది. అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన క‌ట్‌పుట్లి సినిమా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ ఇటీవ‌ల డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. త‌మిళ చిత్రం రాక్ష‌స‌న్ ఆధారంగా సైకో థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ (Rakulpreetsingh) హీరోయిన్‌గా న‌టించింది.

సెప్టెంబ‌ర్‌2న డిస్నీ ప్ల‌స్‌హాట్‌స్టార్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను భారీ ధ‌ర‌కు డిస్నీహాట్‌స్టార్ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. కాగా గ‌త రెండు వారాల్లో డిస్నీప్ల‌స్‌హాట్‌స్టార్ అతి త‌క్కువ మంది చూసిన సినిమాగా క‌ట్‌పుట్లి నిలిచింది. అక్ష‌య్ కెరీర్‌లోనే అతి త‌క్కువ స్ట్రీమింగ్ వ్యూస్ ద‌క్కించుకున్న సినిమాగా నిలిచిన‌ట్లు స‌మాచారం.

అక్ష‌య్ సినిమాను త‌క్కువ మంది వీక్షించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమాపై హైప్‌తో పాటు స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని స‌మాచారం. క‌ట్‌పుట్లి సినిమాకు ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ప్రియుడు జాకీ భ‌గ్నానీ ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ, ఓ మై గాడ్, రామ్ సేతుతో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.