తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి గుడ్‌న్యూస్.. పెరిగిన వడ్డీ రెట్లు.. ఎంతంటే!

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి గుడ్‌న్యూస్.. పెరిగిన వడ్డీ రెట్లు.. ఎంతంటే!

HT Telugu Desk HT Telugu

06 May 2022, 21:32 IST

    • ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో బ్యాంకు రుణాలు ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. అలాగే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచనున్నాయి. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల పెట్టుబడిపై రాబడికి పెరగనుంది.
fixed deposits
fixed deposits

fixed deposits

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి లభించనుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై చెల్లించే వడ్డీ రేట్లు పెరగనున్నాయి. RBI పాలసీ రెపో రేటును సవరించడం వల్ల బ్యాంకు రుణాలు, డిపాజిట్లా రేట్లపై ప్రభావం చూపుతుంది. ఇక రేట్లలో వాస్తవ మార్పు సంబంధిత బ్యాంకు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఫిక్సెడ్ డిపాజిట్

సాధరణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలు, ఇవి వినియోగదారులకు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. తాజాగా RBI తీసుకున్న నిర్ణయం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరింత నమ్మకాన్ని పెంచింది. "కరెంట్ , సేవింగ్స్ డిపాజిట్లతో పాటు వివిధ మెచ్యూరిటీల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించాల్సిన తాజా వడ్డీ రేటు సవరించిన దానిని బట్టి డిపాజిట్ల ధరను లెక్కించాలి" అంటూ RBI ఇచ్చిన స్టెట్‌మెంట్  డిపాజిటర్స్‌కు మరింత భరోసాను ఇచ్చాయి. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు (0.4 శాతం) పెరగడంతో ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ రుణాలపై వడ్డీరేట్లను పెంచాయి.

ఐసీఐసీఐ బ్యాంక్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు (EBALR)ను 40 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. దీంతో వడ్డీరేట్లు 8.1 శాతానికి చేరింది. రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం పెంచింది. పెంచిన కొత్త వడ్డీరేట్లు ఈ నెల 4 అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ ప్రకటించింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI), సెంట్రల్‌ బ్యాంక్‌

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌బీఎల్‌ఆర్‌ 7.25 శాతానికి పెంచింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి రానున్నట్లు బ్యాంక్‌ స్పష్టం చేసింది. దీంతో పాటు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఆర్‌బీఎల్‌ఆర్‌ను 7.25 శాతానికి పెంచింది.

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌

RBI నిర్ణయంతో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా వడ్డీరేట్లను పెంచింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను 0.35 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు రూ.2 కోట్ల దిగువన ఉన్న డిపాజిట్లకు  వర్తించనుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOI) రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (RLLR)ను 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో బీ-ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 6.9 శాతానికి చేరింది.

టాపిక్

తదుపరి వ్యాసం