తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kotak Mahindra Bank ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు

Kotak Mahindra Bank ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు

HT Telugu Desk HT Telugu

05 May 2022, 19:12 IST

google News
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్సడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (REUTERS)

వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కోటక్) తన రిటైల్ ఖాతాదారుల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.35 శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఎఫ్‌డి (ఫిక్స్‌డ్ డిపాజిట్) రేట్లు పెరిగాయని కోటక్ ఒక ప్రకటనలో తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆశ్చర్యకరంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి బ్యాంకులకు స్వల్పకాలిక రుణాలను అందించే బెంచ్‌మార్క్ రెపో రేటును బుధవారం 4.40 శాతానికి పెంచింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ద్రవ్యోల్భణం ఆజ్యం పోయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

‘రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న అన్ని డిపాజిట్లపై ఈ పెంపుదల మే 6వ తేదీ నుండి అమలులోకి వస్తుంది’ అని కోటక్ తెలిపింది.

390 రోజుల డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటు 5.50 శాతంగా ఉంటుంది. వీటిపై 0.30 శాతం పెరిగింది.

23 నెలల పాటు డిపాజిట్ చేసిన నిధులపై వినియోగదారులు అదనంగా 0.35 శాతం వరకు.. అంటే 5.60 శాతం వడ్డీ రేటు పొందుతారు.

సీనియర్ సిటిజన్‌లకు 23 నెలలు, అంతకంటే ఎక్కువ కాలవ్యవధికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 6.10 శాతం వడ్డీ రేటు అందిస్తామని బ్యాంక్ తెలిపింది.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోని బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ విరాట్ దివాన్‌జీ ‘గడిచిన రెండేళ్లుగా వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. తాజా పెంపు ఒక సువర్ణావకాశం. వడ్డీ రేట్ల పెంపును ప్రకటిస్తున్న బ్యాంకుల్లో కోటక్ మొదటిది..’ అని పేర్కొన్నారు.

వినియోగదారులు తమ ప్రతిష్టాత్మకమైన లక్ష్యాల కోసం పొదుపు చేయడానికి, తమ పొదుపుపై ​​అధిక రాబడిని పొందేందుకు ఇదే సరైన సమయం అని ఆయన అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం