తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Anand Sai HT Telugu

18 May 2024, 20:00 IST

google News
    • Sleeping Tips In Telugu : మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్నిస్తుంది. సరైన నిద్రలేకుంటే మెుత్తం శ్రేయస్సు దెబ్బతింటుంది. నిద్రకు ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
మంచి నిద్ర కోసం చిట్కాలు
మంచి నిద్ర కోసం చిట్కాలు (Freepik)

మంచి నిద్ర కోసం చిట్కాలు

ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ నిద్ర లేకపోవడం మన ఆరోగ్యాన్ని చాలా చెడుగా ప్రభావితం చేస్తుంది. తరచుగా తీవ్రమయ్యే ఆరోగ్య సమస్యలను నివారించడంలో మంచి రాత్రి నిద్ర చాలా సహాయపడుతుంది. కానీ మీ శరీరానికి తగినంత నిద్ర లేకపోతే అది మిమ్మల్ని ఎక్కువ ప్రమాదంలో పడేస్తుంది. కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

కొన్ని జీవనశైలి మార్పులు మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ పరిస్థితులను పరిష్కరించడానికి తీసుకునే పోషకాలు చాలా సహాయపడతాయి. మన నిద్రను ప్రేరేపించే మార్గాలను పరిశీలిస్తున్నప్పుడు మనం అందరం పరిగణించవలసిన ముఖ్యమైన అంశం పోషకాహారం. దీని లోపం తరచుగా మీ ఆరోగ్యానికి సమస్యలను కలిగిస్తుంది. అయితే ఎలాంటి పోషకాలు తినాలో చూద్దాం.

విటమిన్ డి

విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే, అది శరీరంలోని ఇతర పోషకాలను గ్రహించదు. ఇది తరచుగా నిద్ర రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా ఇది నిద్ర సమస్యలు, తక్కువ నిద్ర వ్యవధి, రాత్రి మేల్కొనడానికి కారణమవుతుంది. ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.

మెగ్నీషియం

శరీరానికి మెగ్నీషియం అవసరం. ఇది మీ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం తరచుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మెగ్నీషియం శరీరానికి విశ్రాంతినిస్తుంది. మెగ్నీషియం ఆందోళనను తగ్గించడానికి, ఆరోగ్య సమస్యలను నివారించడానికి అవసరం. మీరు మెగ్నీషియం అధికంగా ఉండే గింజలు, బచ్చలికూర, అరటిపండ్లు, అవకాడోలు, బంగాళదుంపలు వంటి వాటిని తినాలి, తద్వారా మీ శరీరం త్వరగా నిద్రపోతుంది.

పండ్లు తీసుకోవాలి

పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా తీసుకోవాలి. ఇది నిద్రకు సంబంధించినది. నెయ్యి, అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్‌లు అన్నీ ఒమేగా 3కి అద్భుతమైన మూలాలు. చిక్‌పీస్, బంగాళదుంపలు, అరటిపండ్లు కూడా నిద్రకు ముందు తినాలి. దీన్ని రెగ్యులర్ గా తీసుకునే వారిలో నిద్ర సంబంధిత సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది.

ఐరన్

ఐరన్ శరీరానికి చాలా అవసరం. తరచుగా శరీరంలో ఐరన్ లోపం నిద్ర నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఐరన్ లోపం తరచుగా మీ నిద్రతో సమస్యలను కలిగిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉసిరికాయ, బార్లీ, కాయధాన్యాలు, సోయాబీన్స్, ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నిద్రకు ముందు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంలో గొప్ప మార్పులు వస్తాయి.

విటమిన్ B6

ఆరోగ్యానికి విటమిన్ B6 అవసరం. మీకు నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్ B6 సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇవన్నీ మంచి నిద్ర, విశ్రాంతి, మంచి మానసిక స్థితికి సహాయపడతాయి. మీరు విటమిన్ B6ను తీసుకోవాలి. ఇవన్నీ నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు తప్పనిసరిగా ఆచరించాలి. అప్పుడే మంచి నిద్ర మీకు సొంతమవుతుంది. లేదంటే మెుత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది.

నిద్ర అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. అందుకోసం సరైన విధానాలను పాటించాలి. రోజూ 8 గంటల నిద్ర మనిషి అవసరం. లేదంటే మెుత్త ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రకు ముందు ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు పెట్టుకోకూడదు.

తదుపరి వ్యాసం