Vitamin D deficiency: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వారికి విటమిన్ డి లోపం ఉన్నట్టే-if your child has these symptoms it means they have a vitamin d deficiency ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitamin D Deficiency: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వారికి విటమిన్ డి లోపం ఉన్నట్టే

Vitamin D deficiency: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వారికి విటమిన్ డి లోపం ఉన్నట్టే

Haritha Chappa HT Telugu

Vitamin D deficiency: విటమిన్ డి లోపం ఉంటే అది శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎముక కండరాలను బలహీనపరుస్తుంది. మీ పిల్లల్లో కొన్ని లక్షణాల ద్వారా విటమిన్ డి లోపం ఉందో లేదో తెలుసుకోవచ్చు.

విటమిన్ డి లోపం లక్షణాలు (pixabay)

Vitamin D deficiency: విటమిన్ డి మన శరీరానికి అత్యవసరమైన పోషకం ఇది. ఎముక, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలు బలంగా ఉండాలన్నా, కండరాలు శక్తివంతంగా అవ్వాలన్నా శరీరానికి విటమిన్ డి పుష్కలంగా అందాలి. విటమిన్-డి తగినంత ఉంటేనే మన శరీరం ఆహారం నుండి కాల్షియం, ఫాస్ఫేట్లను గ్రహిస్తుంది. చేపల వంటి వాటిలో విటమిన్ డి సహజంగానే ఉంటుంది. అలాగే సూర్యకిరణాల ద్వారా తగినంత విటమిన్ డిని పొందవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. లేకపోతే వారిలో రికెట్స్ వంటి ఎముక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో విటమిన్ టీ లోపం ఉందో లేదో చెప్పే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇక్కడ చెప్పిన లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వారికి విటమిన్ డి లోపం ఉన్నట్టే.

ఎముకల నొప్పి

విటమిన్ డి లోపంతో ఉన్న పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు. కండరాలు, ఎముకలు నొప్పితో బాధపడుతూ ఉంటారు. నిత్యం అలసిపోయి కనిపిస్తారు. వారి ఎముకలు బలహీనంగా ఉంటాయి. 24 గంటలు వారు అలసిపోయినట్టే ఉంటారు. వారికి దేనిమీద ఏకాగ్రత కుదరదు.

చర్మం పాలిపోవడం

మన చర్మంలోని కొలెస్ట్రాల్ సూర్య కిరణాల్లోని వేడిని గ్రహించి విటమిన్ డిగా మారుతుంది. ఇదే చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎప్పుడైతే విటమిన్ డి లోపిస్తుందో చర్మం ప్రకాశవంతంగా ఉండదు. పాలిపోయినట్టు అవుతుంది. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల కూడా చర్మం పాలినట్టు కనిపిస్తుంది.

బరువు తక్కువ

విటమిన్ డి లోపంతో బాధపడే పిల్లలు బరువు తగ్గుతూ ఉంటారు. వారికి ఆకలి కూడా వేయదు. ఏ ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. వారి రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. మీ పిల్లల ఆహారపు అలవాట్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారికి విటమిన్ డి లోపం ఉందేమో పరీక్ష చేయించడం ఉత్తమం.

నిద్రా సమస్యలు

విటమిన్ డి లోపం ఉంటే నిద్రా సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. పిల్లలు రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువ సేపు మేల్కొనే ఉంటారు. అప్పుడు కూడా వారు అలసిపోయినట్టే కనిపిస్తారు. అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం వంటివి చేస్తారు. వారికి తగినంత విటమిన్ డి అందేలా చూస్తే మంచిది. కొవ్వు పట్టిన చేపలు, గుడ్డులోని పచ్చ సొన వారికి తినిపించడం ద్వారా విటమిన్ డి అందేలా చేయవచ్చు.

మీ పిల్లలు తరచూ ఎముకలనొప్పి, కండరాల నొప్పి అని చెబుతూ ఉంటే తేలికగా తీసుకోకండి. ఇది రికెట్స్ వ్యాధికి కారణం అవుతుంది. మీ బిడ్డ తరచుగా అనారోగ్యం పాలవుతున్నా, అలసటగా కనిపిస్తున్నా, విటమిన్ డి తక్కువగా ఉందేమో వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షించడం ఉత్తమం. అలాగే పిల్లలకు విటమిన్ డి అందేందుకు ప్రతి ఉదయం వారిని అరగంట పాటు సూర్యరశ్మి తాకేలా ఉంచండి. ఎన్నో సమస్యలు వారి నుంచి దూరం అవుతాయి. అలాగే పుట్టగొడుగులు, చేపలు తరచూ పిల్లలకు తినిపిస్తూ ఉండండి.