తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రూ. 1 లక్ష డిపాజిట్‌పై రూ. 21,011 వడ్డీ.. ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఉజ్జీవన్

రూ. 1 లక్ష డిపాజిట్‌పై రూ. 21,011 వడ్డీ.. ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఉజ్జీవన్

HT Telugu Desk HT Telugu

24 May 2022, 19:02 IST

    • న్యూఢిల్లీ, మే 24: సాధారణ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 7.1 శాతం వరకు పెంచినట్లు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్‌బీ) మంగళవారం తెలిపింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ప్రతీకాత్మక చిత్రం)
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ప్రతీకాత్మక చిత్రం) (REUTERS)

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ప్రతీకాత్మక చిత్రం)

15 నెలల 1 రోజు నుంచి 18 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్లు పెంచి 6.75 శాతానికి, అలాగే 990 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 35 బేసిస్ పాయింట్లు పెంచి వడ్డీరేట్లు 7.1 శాతానికి పెంచారు. 

7.1 శాతంతో 990 రోజుల పాటు రూ. 1,00,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 1,21,011 వరకు రాబడిని పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద కస్టమర్లు 7.45 శాతం వడ్డీ సంపాదించవచ్చని, అదే సీనియర్ సిటిజన్‌లకు వడ్డీ రేటు ఇప్పుడు 7.95 శాతం వరకు ఉంటుందని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

కనిష్టంగా రూ. 15 లక్షల నుంచి రూ. 2 కోట్ల లోపు వరకు గల డిపాజిట్లను ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా గుర్తిస్తున్నట్టు బ్యాంక్ తెలిపింది. సవరించిన రేట్లు మే 19, 2022 నుండి అమలులోకి వస్తాయి.

నెలవారీ, త్రైమాసిక, మెచ్యూరిటీ వడ్డీ చెల్లింపు ఆప్షన్లను ఈ బ్యాంక్ అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వర్తిస్తాయని, అవి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటాయని పేర్కొంది.

‘మా వ్యాపారంలో కస్టమర్ ప్రయోజనం ప్రధానంగా ఉండాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచాలని నిర్ణయించాం. అభివృద్ధి చెందుతున్న స్థూల ఆర్థిక నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం..’ అని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కరోల్ ఫుర్టాడో చెప్పారు.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు టెర్మ్ డిపాజిట్ సెక్టార్‌లో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని తెలిపారు.

తదుపరి వ్యాసం