తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu

18 May 2024, 15:18 IST

google News
  • సీబీఎస్ఈ 10వ తరగతి, 12 వ తరగతి ఫైనల్ పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ మే 13న విడుదల చేసింది. ఇప్పుడు విద్యార్థులు తమ మార్కుల వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. తమకు వచ్చిన మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు cbse.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సీబీఎస్ఈ 12 వ తరగతి మార్కుల వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
సీబీఎస్ఈ 12 వ తరగతి మార్కుల వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

సీబీఎస్ఈ 12 వ తరగతి మార్కుల వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

CBSE Class 12 marks verification: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలను ప్రకటించిన అనంతరం, ఇప్పుడు తాజాగా, విద్యార్థుల మార్క్ ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 17న ప్రారంభమై మే 21తో ముగుస్తుంది. అభ్యర్థులు సీబీఎస్ఈ (CBSE) అధికారిక వెబ్సైట్ cbse.gov.in ద్వారా మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రాసెసింగ్ ఛార్జీగా ఒక్కో సబ్జెక్టుకు రూ.500/ చెల్లించాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

సీబీఎస్ఈ 12 వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కోసం ఇలా దరఖాస్తు చేయాలి

  • తమ మార్కుల విషయంలో అనుమానాలు ఉన్న సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అందుకు వారు ముందుగా సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbse.gov.in ను ఓపెన్ చేయాలి.
  • నోటిఫికేషన్ లిస్ట్ కింద హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న వెరిఫికేషన్ ప్రాసెస్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు అప్లై ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు 12 వ తరగతి వెరిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్తగా ఓపెన్ అయిన పేజీలో రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, సెంటర్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి మీరు వెరిఫై చేయాలనుకుంటున్న సబ్జెక్టుకు అప్లై చేయాలి.
  • ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.

లాగిన్ అయిన అకౌంట్లోనే రిజల్ట్ కూడా..

మార్కుల వెరిఫికేషన్ ఫలితాలను అభ్యర్థి వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అదే లాగిన్ ఖాతాలోనే తెలియజేస్తారు. ఒకవేళ మార్కుల్లో మార్పు వస్తే మార్కులు మార్చినట్లు మొదటి కమ్యూనికేట్ చేస్తారు. ఆ తర్వాత ఫలితాలను తిరిగి లెక్కించాక అసలు మార్కుల పెరుగుదల లేదా తగ్గుదల కూడా అప్ లోడ్ చేస్తారు. ఆయా సబ్జెక్టుల మూల్యాంకనం చేసిన ఆన్సర్ బుక్ ఫొటో కాపీ పొందేందుకు మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. అలాగే, ఆన్సర్ బుక్ ఫొటోకాపీ పొందిన అభ్యర్థులు మాత్రమే రీ వ్యాల్యుయేషన్ (re-evaluation) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.

87.98 శాతం ఉత్తీర్ణత

సీబీఎస్ఈ 10వ తరగతి (CBSE Class 10), 12 వ తరగతి (CBSE Class 12) ఫైనల్ పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ మే 13న విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 87.98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,62,1224 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,42,6420 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 91.52 శాతం, బాలురు 85.12 శాతం ఉత్తీర్ణత సాధించారు.

తదుపరి వ్యాసం