CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?-cbse results 2024 class 10 12 board exam results likely after may 20 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
May 03, 2024 04:27 PM IST

CBSE Results 2024: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసే తేదీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం కీలక అప్ డేట్ ను ఇచ్చింది. మే 20వ తేదీ తరువాతనే 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది.

మే 20 తరువాతనే సీబీఎస్ఈ రిజల్ట్స్
మే 20 తరువాతనే సీబీఎస్ఈ రిజల్ట్స్

CBSE Results 2024: మే 20, 2024 తర్వాత 10, 12 తరగతుల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం తెలిపింది. ‘‘2024 మే 20 తర్వాత సిబిఎస్ఇ పదవ తరగతి మరియు పన్నెండో తరగతి బోర్డు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది’’ అని అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను ప్రకటించిన వెంటనే సీబీఎస్ఈ తన అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో ఫలితాల లింక్ ను యాక్టివేట్ చేస్తుంది. డిజిలాకర్ యాప్, ఉమంగ్ యాప్, ఎస్ఎంఎస్ సదుపాయం ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

ఈ సంవత్సరం కూడా మెరిట్ జాబితా ఉండదు..

విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నిరుత్సాహపరచడానికి, సీబీఎస్ఈ (CBSE) ఎటువంటి మెరిట్ జాబితాలను ప్రచురించకూడదని నిర్ణయించింది. అందువల్ల ఈ ఏడాది కూడా టాపర్ల జాబితాను బోర్డు ప్రకటించే అవకాశం లేదు. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.

సిబిఎస్ఇ ఫలితాలు 2024: ఈ వెబ్ సైట్స్ లో బోర్డు ఫలితాలు

10వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్ష ఫలితాలను సీబీఎస్ఈ ప్రకటించిన తరువాత విద్యార్థులు తమ రిజల్ట్స్ ను ఈ కింది వెబ్ సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు.

  • cbseresults.nic.in
  • results.cbse.nic.in
  • cbse.gov.in
  • results.gov.in
  • విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, సెక్యూరిటీ పిన్ వంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం ఉత్తీర్ణత సాధించాలి.

సిబిఎస్ఇ ఫలితాలు 2024: ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

10వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్ష ఫలితాలను సీబీఎస్ఈ ప్రకటించిన తరువాత విద్యార్థులు తమ రిజల్ట్స్ ను ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తెలుసుకోవచ్చు.

  • సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లేదా results.cbse.nic.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో పరీక్షలు / బోర్డు ఫలితాలు 2024 కోసం లింక్ పై క్లిక్ చేయండి
  • 10 వ తరగతి లేదా 12 వ తరగతి బోర్డు ఫలితాలు 2024 కోసం కావలసిన లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త విండో ఓపెన్ అవుతుంది. రోల్ నంబర్, స్కూల్ నంబర్, సెక్యూరిటీ పిన్ వంటి అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ చేయండి.
  • సీబీఎస్ఈ 10 వ తరగతి లేదా 12 వ తరగతి ఫలితాలు మీ స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • మీ రిజల్ట్ కాపీని డౌన్ లోడ్ చేయండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

డిజీలాకర్ ద్వారా

విద్యార్థులు తమ ఫలితాలను మీ డిజిలాకర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

  • డిజీలాకర్ యాప్ లోకి లాగిన్ కావాలి. లేదా కొత్తగా యాప్ లో అక్కౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి.
  • సీబీఎస్ఈ 12 వ తరగతి లేదా 10 వ తరగతి ఫలితాలు 2024 యాక్టివేటెడ్ లింక్ ను ఎంచుకోండి
  • మీ ఆధార్ నంబర్ ను నమోదు చేయండి.
  • మీ స్కోర్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

ఫిబ్రవరి , మార్చ్ నెలల్లో పరీక్షలు

10వ తరగతి బోర్డు పరీక్షలను 2024 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు సీబీఎస్ఈ నిర్వహించింది. అలాగే, 2024 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఒకే షిఫ్టులో రెండు పరీక్షలు జరిగాయి. 2024 లో 10 మరియు 12 వ తరగతి బోర్డు పరీక్షలకు సుమారు 39 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

IPL_Entry_Point