తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

HT Telugu Desk HT Telugu

18 May 2024, 20:05 IST

google News
  • COVID-19 in Singapore: కొరోనా మహమ్మారి అంతమైందని ఊపిరి తీసుకునే ప్రతీసారి నేనున్నానంటూ కోవిడ్ 19 ప్రత్యక్షమవుతోంది. తాజాగా, సింగపూర్ లో మళ్లీ కొరోనా కలకలం చెలరేగుతోంది. సింగపూర్ లో కొత్త కోవిడ్ 19 వేవ్ ప్రారంభమైందని వైద్యులు చెబుతున్నారు. అక్కడ మే 5 నుంచి 11 మధ్య 25,900కు పైగా కేసులు నమోదు అయ్యాయి. 

సింగపూర్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న కొరోనా కేసులు
సింగపూర్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న కొరోనా కేసులు

సింగపూర్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న కొరోనా కేసులు

COVID-19 in Singapore: సింగపూర్లో కోవిడ్-19 కొత్త వేవ్ విజృంభిస్తోంది. మే 5 నుంచి 11 మధ్య 25,900కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రతీవారం అంతకుముందు వారం కన్నా దాదాపు రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. మాస్కులు ధరించడం సహా పౌరులంతా కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని సూచిస్తోంది.

25 వేలకు పెరిగిన కేసులు

2024 మే 5 నుండి మే 11 మధ్య, వారం రోజుల్లో సింగపూర్ లో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సంఖ్య 25,900 కు చేరింది. అంతకుముందు వారం నమోదైన 13,700 కోవిడ్ 19 కేసులతో పోలిస్తే ఇది 90% పెరుగుదల అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య రోజువారీ సగటు 181 నుండి 250 కు పెరిగిందని వెల్లడించింది. అలాగే, ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందన్నారు.

కోవిడ్ 19 కొత్త వేవ్

‘‘మేము కోవిడ్ 19 వేవ్ ప్రారంభంలో ఉన్నాము. ఇక్కడ ఇది క్రమంగా పెరుగుతోంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో అంటే జూన్ మధ్య నుంచి చివరి వరకు కరోనా ఉధృతి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నాం’’ అని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. దేశంలో కోవిడ్ 19 ఇన్ఫెక్షన్స్ పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కేసుల సంఖ్య భారీగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రోగులను ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. లక్షణాలు స్వల్పంగా ఉంటే లేదా వారికి ఇతర వైద్య సమస్యలు లేకపోతే వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తామన్నారు. అర్హులైన పౌరులంతా మరో డోస్ కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సింగపూర్ లో కేపీ.1, కేపీ.2 కొరోనా వేరియంట్ కేసులే మూడింట రెండొంతుల వరకు ఉన్నాయి. కేపీ.1, కేపీ.2 వేరియంట్లు ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని లేదా మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తాయని ఇప్పటివరకు ఎటువంటి సూచనలు లేవు.

తదుపరి వ్యాసం