Covid 19 cases: నాలుగు నెలల గరిష్టానికి కోవిడ్ 19 కేసులు
Covid cases: దేశంలో కోవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం.. శుక్రవారం భారత్ లో నమోదైన కేసుల సంఖ్య గత నాలుగు నెలల్లోనే గరిష్టం.
Covid cases: భారత్ లో శుక్రవారం గత 126 రోజుల్లో నమోదు కానంత ఎక్కువ కొరోనా (corona) కేసులు నమోదయ్యాయి. భారత్ లో శుక్రవారం నమోదైన రోజువారీ కొరోనా కేసుల సంఖ్య 800 దాటింది. దాంతో, ప్రస్తుతం దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 కి చేరింది.
Covid cases: మొత్తం 4 కోట్లకు పైగా..
శుక్రవారం ఒకే రోజు నమోదైన 843 కొత్త కేసులతో కలుపుకుని ఇప్పటివరకు భారత్ లో మొత్తం 4,46,94,349 కొరోనా కేసులు (corona cases) నమోదయ్యాయి. అలాగే, భారత్ లో కోవిడ్ 19 (covid 19) కారణంగా శుక్రవారం నలుగురు చనిపోయారు. వారితో కలుపుకుని కొరోనా కారణంగా భారత్ లో చనిపోయిన వారి సంఖ్య 5,30,799 కి చేరింది. కోవిడ్ 19 (covid 19) తో శుక్రవారం మహారాష్ట్రలో ఒకరు, జార్ఖండ్ లో ఒకరు, కేరళలో ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం భారత్ లో కోవిడ్ 19 (covid 19) రికవరీ రేటు 98.90% గా ఉంది. అలాగే, మొత్తం కేసుల సంఖ్యతో పోలిస్తే, ప్రస్తుత యాక్టివ్ కేసులు 0.01% ఉన్నాయి. కోవిడ్ 19 నుంచి ఇప్పటివరకు భారత్ లో 4,41,58,161 కోలుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలో దేశవ్యాప్త కొరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మొత్తం 220.64 కోట్ల కొరోనా టీకా (corona vaccines) డోసులు వేశారు.