Covid: కొరోనా కేసులు పెరుగుతున్నాయి; తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
Spike in Covid cases: కొరోనా కేసుల సంఖ్య మరోసారి గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతున్న తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Spike in Covid cases: నిజానికి గత కొన్ని నెలలుగా భారత్ లో కొరోనా (corona) కేసుల సంఖ్య చాలా తగ్గింది. కానీ గత రెండు వారాలుగా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కొరోనా (corona) కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గుర్తించింది. దాంతో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది.

Spike in Covid cases: ఆరు రాష్ట్రాల్లో..
తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా కరోనా (corona) కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. అందువల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి స్థానికంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు. క్షేత్ర స్థాయిలో కొరోనా (corona) కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొరోనా (corona) కట్టడికి ముఖ్య ఆయుధాలైన మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాలన్నారు.
Spike in Covid cases: గత వారం 2 వేల కేసులు..
మార్చి 8వ తేదీతో ముగిసే వారంలో దేశవ్యాప్తంగా 2,083 కొత్త corona కేసులు నమోదయ్యాయి. అలాగే, మార్చి 15తో ముగిసే వారంలో దేశవ్యాప్తంగా 3,264 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణ (Telangana) లో మార్చి 8తో ముగిసే వారంలో కొత్తగా 132 corona కేసులు నమోదు కాగా, మార్చి 15 తో ముగిసే వారంలో 267 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మార్చి 8తో ముగిసే వారంలో కొత్తగా 355 కేసులు నమోదు కాగా, మార్చి 15 తో ముగిసే వారంలో 668 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో మార్చి 8తో ముగిసే వారంలో కొత్తగా 105 కేసులు నమోదు కాగా, మార్చి 15 తో ముగిసే వారంలో 279 కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో మార్చి 8తో ముగిసే వారంలో కొత్తగా 493 (corona) కేసులు నమోదు కాగా, మార్చి 15 తో ముగిసే వారంలో 604 కేసులు నమోదయ్యాయి.
Spike in Covid cases: మిగతా వ్యాధులపై అప్రమత్తత
ఈ నేపథ్యంలో, కొత్త (corona) కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, క్లస్టర్లుగా ఏర్పాటు చేసి, అక్కడినుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజేశ్ భూషణ్ వివరించారు. కోవిడ్ (covid 19) తరహా లక్షణాలతో ఫ్లూ తరహా వ్యాధులు, తీవ్రమైన శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య వ్యవస్థలను సిద్ధం చేసి పెట్టుకోవాలని కోరారు. టెస్ట్ ల సంఖ్యను, జీన్ సీక్వెన్సింగ్ ను పెంచాలన్నారు.