Rajnath Singh tests positive: కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు కోవిడ్ 19
Rajnath Singh tests positive: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) కు కోవిడ్ 19 (Covid 19) పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొరోనా (corona) సోకడంతో హోం క్వారంటైన్ లో ఉంటున్నానని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ ప్రకటించారు.
Rajnath Singh tests positive: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) కు కొరోనా (corona) సోకింది. కోవిడ్ 19 (Covid 19) పాజిటివ్ గా గురువారం నిర్ధారణ కావడంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. రాజ్ నాథ్ కు కోవిడ్ 19 (Covid 19) కు సంబంధించిన స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలో వైద్యుల బృందం రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) ను ఆయన నివాసంలో పరీక్షించారు. కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. తనకు కొరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ (Covid 19) నిర్ధారణ పరీక్ష చేసుకోవాలని రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) కోరారు.
Rajnath Singh tests positive: కమాండర్స్ సదస్సులో..
ఢిల్లీలో జరుగుతున్న భారతీయ వాయుసేన కమాండర్స్ కాన్ఫరెన్స్ (Indian Air Force Commanders' conference) లో రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) గురువారం పాల్గొనాల్స ఉంది. కానీ కొరోనా (corona) సోకినట్లుగా నిర్ధారణ కావడంతో ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆర్మీ కమాండర్స్ కాన్ఫెరెన్స్ (Army Commanders' conference) కు రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) బుధవారం హాజరయ్యారు. ఆ సదస్సులో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఫైరింగ్ సిమ్యులేటర్ పై స్మాల్ ఆర్మ్స్ ను పనితీరును రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) పరిశీలించారు.
టాపిక్