కరోనా ఉద్ధృతి ఆగటం లేదు. రోజురోజుకు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఢిల్లీ, మహారాష్ట్రలో భారీగా కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది.