తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Highest Interest Rates | సేవింగ్స్ అకౌంట్‌పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులివే

highest interest rates | సేవింగ్స్ అకౌంట్‌పై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులివే

03 February 2022, 19:08 IST

    • highest interest rates on savings account | ప్రభుత్వ రంగంలోని షెడ్యూల్డు బ్యాంకులైనా, అతి పెద్ద ప్రయివేటు బ్యాంకులైనా సేవింగ్స్ అకౌంట్‌లో ఉండే సొమ్ముపై అత్యల్ప వడ్డీ రేటుతో వడ్డీ లెక్కించి ఇస్తాయి. కానీ కొన్ని ప్రయివేటు బ్యాంకులు మాత్రమే 6 శాతానికి పైగా వడ్డీ రేటు అందిస్తుండడం విశేషం.
ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఎక్కువ వడ్డీ లభిస్తుంది?
ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఎక్కువ వడ్డీ లభిస్తుంది? (unsplash)

ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఎక్కువ వడ్డీ లభిస్తుంది?

మనం పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు 10.50 శాతం వడ్డీ కంటే తక్కువకు దొరకవు. కానీ మన సేవింగ్స్ అకౌంట్‌లో నగదు ఉంటే మాత్రం మనకు ఇచ్చే వడ్డీ కేవలం 2.7 శాతం మాత్రమే. కొన్ని బడా బ్యాంకులు మనకు ఇచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. కానీ కొన్ని చిన్న బ్యాంకులు మాత్రం సేవింగ్స్ అకౌంట్ ఖాతాలపై మంచి వడ్డీ రేటుతో వడ్డీ లెక్కించి ఇస్తున్నాయి. అయితే కేవలం వడ్డీ ఎక్కువగా చెల్లిస్తున్నాయని మాత్రమే కాకుండా ఆయా బ్యాంకుల దీర్ఘకాలిక ట్రాక్ రికార్డు, సేవలు, ఏటీఎం నెట్ వర్క్ వంటి అంశాలు చూసి సేవింగ్స్ ఖాతా తెరవడం మంచిది. 

డీసీబీ బ్యాంకు:

డీసీబీ బ్యాంకు తన సేవింగ్స్ అకౌంట్లపై 6.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ లెక్క కట్టి ఇస్తుంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలంటే మనం కనీసం నెలవారీ బాలెన్స్ రూ. 2,500 నుంచి రూ. 5 వేల వరకు మెయింటేన్ చేయాలి. 

బంధన్ బ్యాంక్: 

బంధన్ బ్యాంక్ కొత్త బ్యాంకే అయినప్పటికీ మంచి పాపులారిటీ సాధిస్తోంది. సేవింగ్స్ అకౌంట్‌పై 6 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే నెలవారీ సగటు బాలెన్స్ రూ. 5 వేలు మెయింటేన్ చేయాలన్న నిబంధన విధించింది.

ఆర్‌బీఎల్ బ్యాంకు:

ఆర్‌బీఎల్ బ్యాంకు 6 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఇటీవలికాలంలో ఆర్‌బీఎల్ బ్యాంకు తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఆర్‌బీఎల్ సేవింగ్స్ ఖాతాలో నెలవారీ కనీస బాలెన్స్ రూ. 2,500 నుంచి రూ. 5 వేల వరకు మెయింటేన్ చేయాలి. 

యెస్ బ్యాంక్: 

యెస్ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్స్‌పై 5.25 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే ఇందులో సేవింగ్స్ అకౌంట్ మెయింటేన్ చేయాలంటే నెలకు సగటు కనీస బాలెన్స్ రూ. 10 వేల నుంచి రూ. 25 వేల మధ్య మెయింటేన్ చేయాలి. ఈ బ్యాంకు ఆ మధ్య తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. 

ఇండస్ బ్యాంక్: 

ఇండస్ బ్యాంక్ పటిష్టమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సంస్థ. ఈ బ్యాంక్ పొదుపు ఖాతాలపై 5 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అయితే దీనిలో కనీస నెలవారీ సగటు బాలెన్స్ రూ. 1,500 నుంచి రూ. 10 వేల రకు మెయింటేన్ చేయాల్సి ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం