తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Elss Mutual Fund | ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌తో లాభాలేంటి?

ELSS Mutual Fund | ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌తో లాభాలేంటి?

28 February 2022, 15:34 IST

    • ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ELSS) మ్యూచువల్‌ ఫండ్‌ ప్రత్యేకంగా పన్ను మినహాయింపు కోరే వారికి ఉపయోగపడుతుంది. ఇది కూడా విభిన్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం: మ్యూచువల్ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లాకిన్ కలిగి ఉంటాయి
ప్రతీకాత్మక చిత్రం: మ్యూచువల్ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లాకిన్ కలిగి ఉంటాయి (unsplash)

ప్రతీకాత్మక చిత్రం: మ్యూచువల్ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లాకిన్ కలిగి ఉంటాయి

ELSS ద్వారా పెట్టే పెట్టుబడుల్లో రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 సీ కింద మినహాయింపు కోరవచ్చు. అంటే ఆ మేరకు ఆదాయానికి పన్ను భారం తగ్గుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : పేదవాడిగా పుట్టినా.. ధనవంతులుగా బతికేందుకు చాణక్యుడు చెప్పిన రహస్యాలు

Biscuit Bonda : పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్ బోండా.. 5 నిమిషాల్లో రెడీ

Tuesday Motivation : బ్రేకప్ అయితే లైట్ తీసుకోండి బాస్.. అదే మీ విజయానికి తొలిమెట్టు

Summer Sleeping Problems : వేసవిలో రాత్రుళ్లు నిద్రించేందుకు ఇబ్బంది పడితే ఈ చిట్కాలు పాటించండి

ELSS ప్రత్యేకత ఏంటి?

ELSS స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే ప్రతి పైసాకు మూడేళ్ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే మీరు నెలనెలా పెట్టినా, ఏకమొత్తంలో పొదుపు చేసినా ఆ మొత్తం సొమ్ముకు మూడేళ్లు మెచ్యూరిటీ రావాలి.

ఉదాహరణకు మీరు నెలనెలా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పద్ధతిలో మూడేళ్లపాటు ఒక ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నారు. అంటే మొదటి నెలలో పెట్టిన పెట్టుబడికి అయినా, ఏ నెలలో పెట్టిన పెట్టుబడికైనా మూడేళ్లు నిండాలి. అలా మూడేళ్లు నిండిన ప్రతి పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు. అప్పటివరకు రిడీమ్‌ చేసుకోవడానికి వీలు ఉండదు.

దీని వల్ల మంచి ప్రయోజనమే ఉంది. ఈక్విటీల్లో చేసే పెట్టుబడులు స్వల్పకాలం ఉంటే సరిపోదు. దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి. కనీసం మూడేళ్లు లాకిన్‌ పీరియడ్‌ ఉండడం వల్ల ఆయా ఫండ్స్‌ మంచి రాబడులను అందించే అవకాశం ఉంటుంది.

రాబడులు ఎలా ఉంటాయి?

అలాగే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ రాబడులు కూడా మిగిలిన ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే మెరుగైన రాబడులు తెచ్చే ఫండ్స్‌ రకాల్లో ఒకటిగా ఉంటుంది. అందువల్ల వేతన జీవులు ఎక్కువగా ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ వైపు మొగ్గు చూపుతారు.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీముల్లో గ్రోత్‌ స్కీమ్స్, డివిడెండ్‌ స్కీమ్స్‌ అని రెండు రకాలుగా ఉంటాయి. ఎక్కువ మంది మధ్యలో డివిడెండ్‌ ఆశించకుండా గ్రోత్‌ ఆప్షన్‌ ఎంచుకుంటారు. గ్రోత్‌ ఆప్షన్‌లో డివిడెండ్‌ కూడా అందులోనే జమవుతుందన్నమాట. 

టాప్‌ ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను పరిశీలించి, వాటి మూడేళ్ల రాబడి, ఐదేళ్ల రాబడి ఎలా ఉందో చూసి వాటిల్లో చేరడం మంచిది. ఇలా చూసేందుకు వీలుగా అనేక మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, పర్సనల్ ఫైనాన్స్ సంస్థలు తమ వెబ్ సైట్లలో పట్టికలు రూపొందించాయి.

 

టాపిక్