CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్ఈ ఫలితాలు- డిజీలాకర్ యాక్సెస్ కోడ్స్ విడుదల..
05 May 2024, 11:40 IST
- CBSE results 2024 : సీబీఎస్ఈ క్లాస్ 10, సీబీఎస్ఈ క్లాస్ 12 2024 ఫలితాలపై కీలక్ అప్డేట్. డిజీలాకర్ యాక్సెస్ కోడ్స్‌ని సీబీఎస్ఈ విడుదల చేసింది. పూర్తి వివరాలు..
డిజీలాకర్ యాక్సెస్ కోడ్స్ విడుదల చేసిన సీబీఎస్ఈ
CBSE results 2024 date : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్ (సీబీఎఈ).. డిజీలాకర్ యాక్సెస్ కోడ్స్‌ని పాఠశాలకు పంపించినట్టు ప్రకటించింది. క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలను "అతి త్వరలోనే" ప్రకటిస్తామని తెలిపింది.
సీబీఎస్ఈ ఫలితాలు, మార్కులు, సర్టిఫికెట్ల డిజిటల్ కాపీలను విద్యార్థులకు అందించడానికి.. ఈ డిజీలాకర్ వేదికను తీసుకొచ్చింది సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్.
“సీబీఎస్ఈ ఫలితాలు 2024.. త్వరలోనే విడుదలవుతాయి. విద్యార్థుల వారీగా యాక్సెస్ కోడ్ ఫైల్‌ను పాఠశాలలకు వారి డిజీలాకర్ ఖాతాల్లో అందుబాటులో ఉంచుతున్నాము. అక్కడి నుంచి పాఠశాలలు వ్యక్తిగత విద్యార్థులకు యాక్సెస్ కోడ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు,” అని cbse.gov.in లో ప్రచురించిన నోటిఫికేషన్లో పేర్కొంది.
CBSE class 10 results 2024 : సీబీఎస్ఈ డిజిటల్ అకాడమిక్ రిపాజిటరీకో బోర్డు పరీక్షల ఫలితాలను షేర్ చేసేందుకు.. గత కొన్నేళ్లుగా.. డిజీలాకర్ అకౌంట్స్‌ని ఓపెన్ చేస్తోంది సీబీఎస్ఈ. ఫలితాలు వెలువడిన వెంటనే ఇవి ఓపెన్ అవుతాయి.
ఖాతాలను యాక్టివేట్ చేయడానికి 6 డిజిట్ యాక్సెస్ కోడ్స్ అవసరం అవుతాయి. విద్యార్థులు తమ కోడ్స్‌ని పొందడానికి వారి పాఠశాలలను సంప్రదించాలి.
ఫలితాల రోజున విద్యార్థులు తమ 10, 12వ తరగతి ఫైనల్ ఎగ్జామ్ మార్కులను results.cbse.nic.in, cbseresults.nic.in, digilocker.gov.in లో చెక్ చేసుకోవచ్చు. బోర్డు ఎగ్జామ్ రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ ఆన్సైన్ మార్కులను చెక్ చేసుకోవాలి.
CBSE class 12 results 2024 : ఈ ఏడాది సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు 39 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
సీబీఎస్ఈ పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి.
డిజీలాకర్ యాక్సెస్ కోడ్ వివరాలకు సంబంధించిన సీబీఎస్ఈ నోటీస్‌ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
CBSE results 2024 class 10 date and time : డిజిలాకర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మార్క్ షీట్లు, సర్టిఫికెట్లు హార్డ్ కాపీల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయని, పై తరగతుల్లో ప్రవేశం సహా అన్ని భవిష్యత్ అవసరాలకు వీటిని వినియోగించుకోవచ్చని సీబీఎస్ఈ చెబుతోంది. మరిన్ని వివరాలకు విద్యార్థులు cbse.gov.in లేదా cbse.nic.in సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.