CBSE Class 10th result 2024 : డిజీలాకర్‌లో మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి..
CBSE Class 10th result Digilocker : సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాల్ని.. డిజీలాకర్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
CBSE Class 10th result date 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫైనల్ పరీక్షను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు నిర్వహించింది. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ results.cbse.nic.in ని సందర్శించాలి.
అయితే.. సీబీఎస్ఈ.. తన బోర్డు పరీక్ష ఫలితాలను డిజీలాకర్‌లో కూడా పెడుతుందని తెలుస్తోంది. విద్యార్థులు తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి డిజీలాకర్ వెబ్సైట్ - digilocker.gov.in ని సందర్శించవచ్చు. లేదా ఫలితాల రోజున యాప్ ఉపయోగించవచ్చు. డిజీలాకర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో పనిచేస్తుంది.
సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలను చెక్ చేసుకోవడానికి కావాల్సిన డైరెక్ట్ లింక్ డిజీలాకర్‌లో కనిపిస్తుంది.
CBSE Class 10th result Digilocker : మార్కుల షీట్లు, పాస్ సర్టిఫికెట్ల డిజిటల్ కాపీలను కూడా బోర్డు అందజేయనుంది. ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే ఇదే వేదికపై అందుబాటులోకి రానుంది.
ఈ ఏడాది 39 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్షలు ముగియగా, 12వ తరగతి విద్యార్థుల ఫైనల్ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను బోర్డు ఒకే రోజు ప్రకటించే అవకాశం ఉంది.
ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నందున, అధికారిక ప్రకటన తర్వాత కొంతమందికి సీబీఎస్ఈ ఫలితాల పోర్టల్ స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ఆన్లైన్ మార్కుల షీట్లను యాక్సెస్ చేయడానికి డిజీలాకర్ ఒక ప్రత్యామ్నాయ మార్గం.
సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ చెక్ చేయడానికి అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవే:
- రోల్ నంబర్
- స్కూల్ నెంబర్
- పుట్టిన తేదీ.
CBSE Class 10th result 2024 : బోర్డు పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి డిజీలాకర్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అయితే వారు మార్కుల షీట్లు, సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేయాలనుకుంటే, వారు ముందుగా నమోదు చేసుకోవాలని విద్యార్థులు గమనించాలి.
డిజీలాకర్ రిజిస్ట్రేషన్ కోసం సీబీఎస్ఈతో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ అవసరం.
డిజీలాకర్, సీబీఎస్ఈ వెబ్‌సైట్‌తో పాటు ఉమాంగ్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా బోర్డు ఫలితాలను చూపించవచ్చు. ఫలితాల రోజున మరింత సమాచారం లభిస్తుంది.
సంబంధిత కథనం