AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోవచ్చు!-amaravati ap pgecet 2024 online application starts from march 23rd important dates application process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pgecet 2024 : ఏపీ పీజీఈసెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోవచ్చు!

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోవచ్చు!

Bandaru Satyaprasad HT Telugu
Mar 24, 2024 09:54 PM IST

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల ఆన్ లైన్ లో మార్చి 23 నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ పీజీఈసెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఏపీ పీజీఈసెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ను(AP PGCET Notification) రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ పీజీఈసెట్ ను తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఏపీలోని యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌ డీ(PB) కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మే 29 నుంచి 31వ తేదీ వరకు ఏపీ పీజీఈసెట్ పరీక్ష(PGECT Exam Dates) నిర్వహిస్తారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28వ తేదీ వరకు, రూ.2000 ఆలస్య రుసుము(Late Fee)తో మే 5 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తుల మార్పుచేర్పులు చేసుకునేందుకు మే 8 నుంచి 14 వరకు కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు, లేదా చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. గేట్‌, జీప్యాట్‌ అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్ల కోసం మరో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

ఏపీ పీజీఈసెట్ ను ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ లో https://cets.apsche.ap.gov.in/PGECET/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం - మార్చి 23
  • దరఖాస్తుకు చివరి తేదీ - ఏప్రిల్ 20
  • ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం - ఏప్రిల్‌ 21 నుంచి మే 12 వరకు
  • దరఖాస్తు సవరణకు అవకాశం- మే 8 నుంచి మే 14 వరకు
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌- మే 22 నుంచి
  • పరీక్ష తేదీలు - మే 29 నుంచి మే 31 వరకు
  • పీజీఈ సెట్ ప్రాథమిక కీ విడుదల - మే 31, జూన్‌ 1, 2 తేదీలు
  • కీపై అభ్యంతరాల స్వీకరణ- జూన్‌ 2, 3, 4 తేదీలు
  • ఫలితాల ప్రకటన - జూన్‌ 28

ఏపీ పీజీఈసెట్ దరఖాస్తు(AP PGECET Apply) ఎలా?

Step 1 : అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/PGECET/ వెబ్ సైట్ ను సందర్శించండి.

Step 2 : హోం పేజీలో అభ్యర్థి అర్హత, ఫీజు పేమంట్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.

Step 3 : ఫీజు చెల్లింపు పూర్తైందో లేదో 'Know you payment status' లో చెక్ చేసుకోండి.

Step 4 : ఫీజు చెల్లింపు పూర్తి చేసిన తర్వాత దరఖాస్తులో పూర్తి వివరాలు నింపిండి.

Step 5 : అభ్యర్థి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అప్లికేషన్ ను సబ్మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

పరీక్షా విధానం ఇలా

ఏపీ పీజీఈసెట్ ను(AP PGECET Exam Pattern) మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు వారి డిగ్రీ స్థాయిలో సబ్జెక్టులపైనే పరీక్షలు అడుగుతారు. తప్పులకు ఎలాంటి నెగెటివ్ మార్కులు(Negative Marks) ఉండవు. పరీక్ష విధానాన్ని అర్థం చేసుకునేందుకు అభ్యర్థుల కోసం మాక్ టెస్టులకు పీజీఈసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు ఉండవు.

Whats_app_banner

సంబంధిత కథనం