AP Lawcet 2024: ఏపీ లాసెట్‌ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏఎన్‌‍యూ.. జూన్‌ 9న ప్రవేశ పరీక్ష-ap law cet 2024 notification released by anu entrance exam on 9th june ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Law Cet 2024 Notification Released By Anu.. Entrance Exam On 9th June

AP Lawcet 2024: ఏపీ లాసెట్‌ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏఎన్‌‍యూ.. జూన్‌ 9న ప్రవేశ పరీక్ష

Sarath chandra.B HT Telugu
Mar 22, 2024 07:21 AM IST

AP Lawcet 2024: ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐదేళ్ల లా డిగ్రీతో పాటు మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్‌ నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2024 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2024 నోటిఫికేషన్ విడుదల

AP Lawcet 2024: ఆంధ్రప్రదేశ్‌ లాసెట్ 2024 Lawcet 2024 నోటిఫికేషన్‌ Notification విడుదలైంది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది లాసెట్‌ నిర్వహిస్తున్నారు. లాసెట్‌ నోటిఫికేషన్‌ను యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ రాజశేఖర్‌ విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

3ఏళ్ల లా డిగ్రీతో , 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బి LLB కోర్సులు, 2ఏళ్ల పీజీ లా PG Law course కోర్సులకు సంబంధించిన షెడ్యూల్‌ను లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య సత్యనారయణ వివరించారు. మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడేళ్ల లా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పదోతరగతి తర్వాత, ఇంటర్‌, మూడేళ్ల డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులుగా ప్రకటించారు. ఐదేళ్ల లా డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అర్హులుగా పేర్కొన్నారు.

లాసెట్‌కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు రూ.500 జరిమానాతో ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 4 నుంచి 11వరకు, రూ.2వేల పెనాల్టీతో మే 12 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.3వేల పెనాల్టీతో మే 21 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ వివరించారు.

మే 30వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు దరఖాస్తులకు Applications ఎడిట్ ఆప్షన్ సదుపాయం కల్పిస్తారు. జూన్ 3 నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లాసెట్ 2024

లాసెట్‌ 2024 ప్రవేశ పరీక్షను జూన్ 9వ తేదీ మధ్యాహ్నం రెండున్న నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష సిలబస్‌, అర్హతలు, అందుబాటులో ఉన్న సీట్లు, కాలేజీల వివరాలను నోటిఫికేషన్‌ బ్రోచర్‌లో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష సిలబస్‌ కూాడ అందుబాటులో ఉంచారు.

మే 2 నుంచి ఏపీ రీసెర్చ్ సెట్...

ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్‌ సెట్ 2023-24 ప్రవేశ పరీక్షల్ని మే 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆధ‌్వర్యంలో రీసెర్చ్ సెట్‌ నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు తెలిపారు. రాష్ట్రంలో పలు యూనివర్శిటీల్లో ఉన్న పిహెచ్‌డి సీట్ల భర్తీ కోసం ఎస్వీయూ ఆధ్వర్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.

మార్చి 19వ తేదీ వరకు ఆర్‌ సెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.2వేల ఆలస్య రుసుముతో మార్చి 29వరకు, రూ.5వేల రుసుముతో ఏప్రిల్ 6వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్ 10 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

WhatsApp channel