TS PGECET 2024 : పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల - మార్చి 16 నుంచి అప్లికేషన్లు, ముఖ్య తేదీలివే
TS PGECET 2024 Updates: తెలంగాణ పీజీఈసెట్(TS PGECET 2) నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 16వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి.
TS PGECET 2024 Updates: ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో నిర్వహించే తెలంగాణ పీజీఈసెట్(TS PGECET 2024 ) నోటిఫికేషన్ వచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, , ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను మంగళవారం విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. మార్చి 16వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. https://pgecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
ప్రవేశ పరీక్ష - టీఎస్‌పీజీఈసెట్ 2024(TS PGECET 22024)
వర్శిటీ -జేఎన్‌టీయూ, హైదరాబాద్
కోర్సులు - ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డి
అర్హతలు - అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఆర్క్/ బీప్లానింగ్/బీఫార్మసీ, ఎంఏ/ఎంఎస్సీ (సోషియాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిస్థాయి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
దరఖాస్తులు - ఆన్ లైన్
దరఖాస్తు రుసుం - ఓబీసీ అభ్యర్థులు రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - 16- మార్చి-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ - 10, మే-2024.
దరఖాస్తుల ఎడిట్ - 14-మే-2024 - 16-మే-2024.
రూ.250 ఆలస్య రుసుముతో తుది గడువు - 14-మే-2024.
రూ.1000 ఆలస్య రుసుముతో తుది గడువు -17-మే-2024.
రూ.2500 ఆలస్య రుసుముతో అప్లికేషన్లకు తుది గడువు - 21-మే-2024.
రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేదీ - 25-మే-2024.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 28 మే 2024.
పరీక్ష తేదీలు - 06-జూన్-2024 నుంచి 09-జూన్-2024.
అధికారిక వెబ్ సైట్ - https://pgecet.tsche.ac.in/
దరఖాస్తు లింక్ - https://pgecet.tsche.ac.in/PGECET_HomePage.aspx
తెలంగాణ ఈఆర్ సీలో ఉద్యోగాలు
TSERC Recruitment 2024 Updates: తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(Telangana State Electricity Regulatory Commission) ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా కమిషన్ లో ఖాళీగా ఉన్న జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లు, అకౌంట్ ఆఫీసర్, క్యాషియర్, లైబ్రేరియన్, స్టేనో కమ్ ఆపరేట్, పర్సనల్ అసిస్టెంట్ తో పాటు రిసెప్షనిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 1,2024వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. https://tserc.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగాతవారు ఒక్కో దరఖాస్తుకు రూ.120 చెల్లించాలి. కమిషన్ సెక్రటరి, డోర్ నంబర్ 11-4-660, 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004 చిరునామాకు పూర్తి చేసిన అప్లికేషన్లను పంపాలి.