PhD in IIIT Delhi: ఐఐఐటీ ఢిల్లీలో ఎంటెక్, పీహెచ్ డీ ల్లో అడ్మిషన్లు ప్రారంభం-iiit delhi invites applications for mtech phd admissions ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Iiit Delhi Invites Applications For Mtech, Phd Admissions

PhD in IIIT Delhi: ఐఐఐటీ ఢిల్లీలో ఎంటెక్, పీహెచ్ డీ ల్లో అడ్మిషన్లు ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Apr 04, 2023 03:08 PM IST

PhD in IIIT Delhi: ప్రతిష్టాత్మక ఐఐఐటీ ఢిల్లీ (IIIT Delhi)లో ఎంటెక్ (MTech), పీహెచ్ డీ (PhD) ల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (IIITD)

PhD in IIIT Delhi: ఎంటెక్ (MTech), పీహెచ్ డీ (PhD) కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇంద్రప్రస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్మర్మేషన్ టెక్నాలజీ (IIIT-Delhi) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో IIIT-Delhi అధికారిక వెబ్ సైట్ iiitd.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

PhD and MTech in IIIT Delhi: లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

ఐఐఐటీ ఢిల్లీ (IIIT Delhi)లో ఎంటెక్ (MTech) కోర్సులో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 23 కాగా , పీహెచ్ డీ (PhD) లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 16. విద్యార్థుల్లో పరిశోధన ఆసక్తులను పెంచే లక్ష్యంతో ఈ అడ్మిషన్లను చేపట్టామని, పీహెచ్ డీ ప్రోగ్రామ్ కోసం వివిధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఐఐఐటీ ఢిల్లీ (IIIT Delhi) వెల్లడించింది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా స్పాన్సర్డ్ ఫుల్ టైమ్ ప్రొగ్రామ్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

PhD and MTech in IIIT Delhi: ఈ విభాగాల్లో..

వివిధ విభాగాల్లో ఎంటెక్, పీహెచ్ డీలను ఆఫర్ చేస్తున్నామని ఐఐఐటీ ఢిల్లీ (IIIT Delhi) వెల్లడించింది. ఎంటెక్ లో ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence), డేటా ఇంజినీరింగ్ (Data Engineering), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (Information Security), మొబైల్ కంప్యూటింగ్(Mobile Computing) ల్లో స్పెషలైజేషన్ తో సీఎస్ఈ (CSE) ని, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (Communication & Signal Processing), వీఎల్ఎల్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్(VLSI & Embedded Systems), కంప్యుటేషనల్ బయాలజీ(Computational Biology) స్పెషలైజేషన్లతో ఈసీఈ (ECE) ని ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. విద్యార్హతలు, అప్లికేషన్ ఫీ, కోర్సు కంటెంట్, ఇతర పూర్తి వివరాల కోసం iiitd.ac.in వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను చూడండి.

WhatsApp channel