JNTU PhD Admissions 2024 : జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు - కోర్సులు, ముఖ్య తేదీలివే-education news jntu hyderabad phd admission notification 2024 released check the key dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jntu Phd Admissions 2024 : జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు - కోర్సులు, ముఖ్య తేదీలివే

JNTU PhD Admissions 2024 : జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు - కోర్సులు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 26, 2024 07:44 PM IST

JNTU Hyderabad PhD Admissions 2024: పీహెచ్‌డీ ప్రవేశాలకు హైదరాబాద్ లోని జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024-25కు గాను ప్రవేశాలను కల్పించనుంది.

పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ విడుదల
పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ విడుదల (https://jntuh.ac.in/)

JNTU Hyderabad PhD Admissions 2024 Updates: జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU) నుంచి పీహెచ్డీ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా…. 2024-25కు గాను పీహెచ్‌డీ(పార్ట్ టైం/ పుల్ టైం) ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్ సైన్స్ విభాగాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హత గల వారు... ఫిబ్రవరి 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 220 సీట్లను భర్తీ చేయనున్నారు.

ముఖ్య వివరాలు:

యూనివర్శిటీ - వహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU), హైదరాబాద్

కోర్సులు - పీహెచ్డీ ప్రవేశాలు

విభాగాల్లోని ఖాళీలు - కంప్యూటర్‌ సైన్స్‌ 62 సీట్లుు, మెకానికల్‌ 36, ఎలక్ట్రికల్‌ 25, సివిల్‌ 4, ఈసీఈ 18, మెటలర్జీ 8, బయోటెక్నాలజీ 6, కెమిస్ట్రీ 10, ఎన్విరాన్‌మెంట్‌ 4, మ్యాథమేటిక్స్‌ 8, నానోటెక్నాలజీ 3, ఫిజిక్స్‌, వాటర్‌ రిసోర్సెస్‌ 4, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ 6 సీట్లు.

అర్హతలు- డిగ్రీ, పీజీతో పాటు నెట్ అర్హతతో పాటు జీప్యాట్, గేట్ వంటి పరీక్షల్లో ఉత్తర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్

దరఖాస్తు ఫీజు - పుల్ టైం కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే వారు రూ. 1500 చెల్లించాలి. ఎక్స్ టర్నల్ ప్రోగ్రామ్స్ కు రూ. 1000, ఇండస్ట్రీయల్ ఎగ్జిక్యూటివ్స్ ప్రోగ్రామ్స్ కు రూ, 5000 చెల్లించాలి.

దరఖాస్తులు తుది గడువు - ఫిబ్రవరి 24,2024.

ఫైన్ తో దరఖాస్తులు పంపే గడువు - 7. మార్చి, 2024.

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా - డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్టీయూ, కూకట్ పల్లి, హైదరాబాద్ - 500085

అధికారిక వెబ్ సైట్ - https://jntuh.ac.in

దూర విద్యలో ప్రవేశాలు:

Prof. G. Ram Reddy Centre for Distance Education Updates: ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ఫేజ్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా…. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. దరఖాస్తుల ప్రక్రియ మొదలుకాగా... మార్చి 31, 2024వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

ముఖ్య వివరాలు:

యూనివర్శిటీ - ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఉస్మానియా వర్శిటీ

కోర్సుల వివరాలు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు.

కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం

మీడియం : కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.

అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2) / తత్సమాన, గ్రాడ్యుయేషన్, బీకాం, టీఎస్‌ ఐసెట్‌/ ఏపీఐసెట్‌ ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.మార్చి.2024

మెయిల్ - info_cde@osmania.ac.in

అధికారిక వెబ్ సైట్ - https://oupgrrcde.com/

ఇలా దరఖాస్తు చేసుకోండి...

http://www.oucde.net/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Online Admission' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ యూజీ, పీజీ, డిప్లోమా, ఎంబీఎం, ఎంసీఏ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.

-ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కావాలి. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఆ తర్వాత కోర్సు ఎంపిక చేసుకోవటం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. ఇక కోర్సుల ఫీజు సెమిస్టర్ల వారీగా కట్టుకోవచ్చు.

Whats_app_banner