TS Govt Meeseva Centres 2024 : మీ -సేవా సెంటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్... అర్హతలు, కావాల్సిన పత్రాలివే
Meeseva Centres in Telangana : మీసేవా సెంటర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఖమ్మం జిల్లాలోని ఈ- గవర్నెన్స్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. దరఖాస్తు ఫారమ్ ను కూడా అందుబాటులో ఉంచింది.
Meeseva Centres in Telangana : మీ సేవా సెంటర్(Meeseva Centres) ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా…? అయితే ఖమ్మం జిల్లాలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 25 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైంది. రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా…. ఎంపిక ప్రక్రియ జరగనుంది. మార్చి 15,2024వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
ప్రకటన - ఈ- గవర్నెన్స్ సొసైటీ, కలెక్టరేట్ ఖమ్మం జిల్లా.
సెంటర్లు - మీసేవా.
మొత్తం ఖాళీలు - 25 మీసేవా సెంటర్లు.
అర్హతలు - డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ - రాతపరీక్ష, ఇంటర్వూ ఉంటుంది.
మొత్తం మార్కులు - 100( 90 మార్కులు - ప్రశ్నలు, విద్యా అర్హతలు, సాంకేతిక ధ్రువపత్రాలు -05,ఇంటర్వూ -05 మార్కులు).
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ తో పాటు రూ. 10 వేలతో డిమాండ్ డ్రాఫ్ట్ ను డిస్ట్రిక్ ఈ గవర్నరెన్స్ సోసైటీ, ఖమ్మం పేరుపై తీయాలి.
వయసు - 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి15,2024.
పూర్తి చేసిన దరఖాస్తులను ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో ఇవ్వాలి.
పరీక్ష కోసం కాల్ లెటర్ - ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు.
అధికారిక వెబ్ సైట్ - https://khammam.telangana.gov.in/
అర్హతలు:
- అభ్యర్థి స్థానికుడై ఉండాలి.
- దరఖాస్తుదారుడి వయసు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
- డిగ్రీ పాసై ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- ఐటీపై రాత పరీక్ష ఉంటుంది.
- ఇంటర్వూ ఉంటుంది.
-ఏజెన్సీ గ్రామాల్లో సెంటర్ ఖాళీలు ఉంటే… దరఖాస్తు చేసుకుని వారు కూడా షెడ్యూల్ తెగకు చెందినవారై ఉండాలి.
కావాల్సిన పత్రాలు
- పది, ఇంటర్, డిగ్రీ మెమోలు
- కంప్యూటర్ శిక్షణ పొందిన పత్రం.
జనన ధ్రువీకరణ పత్రం.
- నివాస ధ్రువీకరణ పత్రం
- డిమాండ్ డ్రాఫ్ట్
- 2 పాస్ పోర్టు సైజ్ కలర్ ఫొటోలు
- ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు