AP KGBV Admissions 2024-25 : ఏపీ కేజీబీవీల్లో ప్రవేశాలు, ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం
AP KGBV Admissions 2024-25 : ఏపీ కేజీబీవీల్లో 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 12 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది.
AP KGBV Admissions 2024-25 : ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV Admissions) 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ (KGBV Notification)జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 352 కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 12 నుంచి దరఖాస్తులు (AP KGBV Applications)ప్రారంభం కాగా, ఏప్రిల్ 11 చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నరు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ అప్లికేషన్లను మాత్రమే అడ్మిషన్ల కోసం పరగిణిస్తామన్నారు.
ఆన్ లైన్ దరఖాస్తులను https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా స్వీకరించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. దీంతో పాటు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో ఉంచనున్నారు. విద్యార్థులు మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయపరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు మించకూడదు.
ముఖ్య తేదీలు(KGBV Admissions Dates)
- ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం - మార్చి 12
- ఆన్ లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ - ఏప్రిల్ 11
- 6వ తరగతి 7, 8, 9వ తరగతుల మిగిలిన సీట్ల సెలక్షన్ లిస్ట్ ప్రిపరేషన్- ఏప్రిల్ 15
- స్టేట్ ఆఫీస్ లో సెలక్షన్ లిస్ట్ వెరిఫికేషన్ - ఏప్రిల్ 16 నుంచి 18 వరకు
- ఎంపికైన విద్యార్థుల లిస్ట్ విడుదల(స్కూల్ లాగిన్స్, విద్యార్థులకు మెసేజ్ )-ఏప్రిల్ 19
- కేజీబీవీల్లో విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్-ఏప్రిల్ 19 నుంచి 24 వరకు
ఏపీ మోడల్ స్కూల్స్ లో ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో (AP Mode Schools) ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఇందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 1వ తేదీన ప్రకటన విడుదల కాగా… మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష జరగనుంది. https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడవచ్చు.
ముఖ్య వివరాలు:
- ప్రవేశాలు - ఏపీ మోడల్ స్కూల్స్ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
- ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.
- ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
- రుసుం - ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 కట్టాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31. మార్చి.2024.
- పరీక్ష తేదీ -21. ఏప్రిల్ .2024 (ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఉండే స్థానిక మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.)
సంబంధిత కథనం