TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..
02 May 2024, 19:44 IST
- TS Inter Supplementary Exam Fee 2024: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2024
TS Intermediate Supplementary Exam 2024: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు(TS Intermediate Supplementary Exam Fee) గడువును పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మే 2వ తేదీతో ఈ గడువు ముగియగా… మరో రెండు రోజులపాటు సమయాన్ని పొడిగించింది ఇంటర్ బోర్డు. దీంతో విద్యార్థులు మే 4వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.
అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల(TS Inter Supplementary Time Table) తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే కొన్ని మార్పులు కూడా చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు మే/జూన్ 2024 లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు.
ముందుగా మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఈ తేదీలను మే 24 నుంచి జూన్ 3 వరకు మార్చింది. మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా ఈ మార్పులు చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు(TS Intermediate Board) ప్రకటించింది.
TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…
- 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
- 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-1
- 28-05-2024 : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
- 29-05-2024 : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
- 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
- 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
- 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)
- 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1
TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…
- 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
- 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-2
- 28-05-2024 : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
- 29-05-2024 : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
- 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
- 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
- 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students)
- 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబందించిన హాల్ టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానన్నాయి.