AP Inter Supplementary: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు-board released ap intermediate advanced supplementary exams schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Supplementary: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు

AP Inter Supplementary: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు

Sarath chandra.B HT Telugu
Apr 25, 2024 12:41 PM IST

AP Inter Supplementary: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 24 నుంచి జూన్ 1వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

Inter Advanced Supplementary: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల Exams షెడ్యూల్‌  Schedule విడుదలైంది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలయ్యాయి. మే 24 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువును పొడిగించారు.

ఇంటర్‌ Advanced సప్లిమెంటరీ పరీక్షల్ని రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

 Intermediate ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉదయం పూట ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం ఉదయం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. 25వ తేదీ శనివారం ఇంగ్లీష్ పేపర్ 1, 27వ తేదీ సోమవారం పార్ట్‌ 3లో మ్యాథ్స్‌ పేపర్ 1ఏ, బోటరీ పేపర్ 1, సివిక్స్‌ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్ 28వ తేదీన మ్యాథ్స్‌ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. 29వ తేదీ ఫిజిక్స్‌ పేపర్ 1, ఎకనామిక్స్‌ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. 30వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు ఉంటాయి.

31 వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బైపిసి విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్‌ పేపర్ 1 పరీక్ష ఉంటుంది. జూన్ 1వ తేదీన మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలు ఉంటాయి.

ఎథిక్స‌‌ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను జూన్ 6న, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ జూన్ 7న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షల్ని మే 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒకేషనల్ కోర్సుల టైమ్ టేబుల్ విడిగా ప్రకటిస్తారని బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.

ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు...

ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. 25వ తేదీ శనివారం ఇంగ్లీష్ పేపర్ 2, 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం పార్ట్‌ 3లో మ్యాథ్స్‌ పేపర్ 2ఏ, బోటరీ పేపర్ 2, సివిక్స్‌ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్ 28వ తేదీ మధ్యాహ్నం మ్యాథ్స్‌ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. 29వ తేదీ ఫిజిక్స్‌ పేపర్ 2, ఎకనామిక్స్‌ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. 30వ తేదీ కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు ఉంటాయి.

31 వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బైపిసి విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్‌ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. జూన్ 1వ తేదీన మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలు సెకండియర్ విద్యార్ధులకు ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం