తెలుగు న్యూస్ / ఫోటో /
AP Inter Supplementary Exams : మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ తేదీలివే
- AP Inter Supplementary Exam Dates 2024 : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results ) విడుదలయ్యాయి. ఇదే సమయంలో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రకటించారు అధికారులు. మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
- AP Inter Supplementary Exam Dates 2024 : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results ) విడుదలయ్యాయి. ఇదే సమయంలో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రకటించారు అధికారులు. మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
(1 / 7)
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు.(unsplash.com)
(2 / 7)
ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 81 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది.(unsplash.com)
(3 / 7)
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు 87 , ఎన్టీఆర్ 87 రెండో స్థానంలో ఉన్నాయి. 84 శాతంతో విశాఖ మూడో స్థానంలో ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో అల్లూరు జిల్లా 48 శాతంలో చివరి స్థానంలో ఉండగా, సెకండియర్ 63 శాతం చిత్తూరు చివరిస్థానంలో ఉన్నాయి.(unsplash.com)
(4 / 7)
ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు(AP Inter 1st Year Results) మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 67 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు(AP Inter 2nd Year Results) మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవ్వగా, వీరిలో 3,06,528 మంది పాస్ అయ్యారు.(unsplash.com)
(5 / 7)
మరోవైపు సప్లిమెంటరీ తేదీలను ప్రకటించారు అధికారులు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.(AP Inter Board)
(6 / 7)
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 18 నుంచి 24 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు., సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.(AP Inter Board)
ఇతర గ్యాలరీలు