AP Inter Results: రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల..
AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సాయంత్ర ఐదు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.
AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 4,84,197 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా, 5,19,793 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి.
బుధవారం ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలతో పాటు, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను కూడా ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు.
ఇంటర్ పరీక్షా ఫలితాలను కింది లింకుల ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://examresults.ap.nic.in లేదా www.bie.ap.gov.in సైటు నుంచి తెలుసుకోవచ్చు.