AP Inter Supply 2024 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఆలోపే సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి..! రీకౌంటింగ్ కు కూడా ఛాన్స్-ap inter supplementary exam fee 2024 dates announced check the key dates are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Supply 2024 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఆలోపే సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి..! రీకౌంటింగ్ కు కూడా ఛాన్స్

AP Inter Supply 2024 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఆలోపే సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి..! రీకౌంటింగ్ కు కూడా ఛాన్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 14, 2024 12:48 PM IST

AP Inter Supplementary Exams 2024: ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలతో పాటు వివరాలను వెల్లడించింది.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు (https://bieap.apcfss.in/)

AP Inter Supplementary Exams 2024 Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు(AP Inter Results 2024) వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలతో పాటు ముఖ్య వివరాలను వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజు చెల్లించవచ్చని… ఏప్రిల్ 24వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు కూడా ఈ తేదీల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

ముఖ్య వివరాలు :

  • రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు - 1300 చెల్లించాలి
  • రీ కౌంటింగ్ కోరే విద్యార్థులు - 260 చెల్లించాలి.
  • ఇంప్రూమెంట్ పరీక్షలు రాసే ఆర్ట్స్ విద్యార్థులు - 1240 చెల్లించాలి. సైన్స్ విద్యార్థులు 1440 కట్టాలి.
  • సప్లిమెంటరీ పరీక్షలు రాసే ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రూ. 1100 చెల్లించాలి. ప్రాక్టికల్స్ ఫీజు రూ. 500గా ఉంది.

ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల(AP Intermediate Results 2024) అయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 81 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా 79 శాతం మూడో స్థానంలో ఉంది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు 87 , ఎన్టీఆర్ 87 రెండో స్థానంలో ఉన్నాయి. 84 శాతంతో విశాఖ మూడో స్థానంలో ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో అల్లూరు జిల్లా 48 శాతంలో చివరి స్థానంలో ఉండగా, సెకండియర్ 63 శాతం చిత్తూరు చివరిస్థానంలో ఉన్నాయి. ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఈ ఏడాదీ బాలికలదే పై చేయి అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారన్నారు.

HT తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు…

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు(AP Inter Exams 2024) రాసిన ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి…

Whats_app_banner