AP Inter Results 2024 Live Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - టాప్ లో కృష్ణా జిల్లా, బాలికలదే పైచేయి-vijayawada ap inter results 2024 live updates bieap 1st 2nd year results how to download official link timings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Results 2024 Live Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - టాప్ లో కృష్ణా జిల్లా, బాలికలదే పైచేయి

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

AP Inter Results 2024 Live Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - టాప్ లో కృష్ణా జిల్లా, బాలికలదే పైచేయి

11:03 AM ISTApr 12, 2024 03:59 PM Bandaru Satyaprasad
  • Share on Facebook
11:03 AM IST

  • AP Inter Results 2024 Live Updates : ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 (AP Inter Results 2024 ) విడుదల అయ్యాయి. ఇంటర్ ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ రీఫ్రెష్ చేస్తూ ఉండండి. ఇంటర్ ఫలితాలను హెచ్.టి.తెలుగు లింక్ https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result ద్వారా తెలుసుకోవచ్చు.

Fri, 12 Apr 202410:29 AM IST

టాప్ లో కృష్ణా జిల్లా

ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 81 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది.

Fri, 12 Apr 202409:17 AM IST

రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తేదీలివే

రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 18 నుంచి 24 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఏపీ ఇంటర్ బోర్డు  అధికారులు పేర్కొన్నారు., సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

Fri, 12 Apr 202409:16 AM IST

మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు…

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ తేదీలను ప్రకటించారు అధికారులు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Fri, 12 Apr 202406:44 AM IST

AP Inter results 2024 live updates : ఏపీ ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు

 ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు(AP Inter 1st Year Results) మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 67 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు(AP Inter 2nd Year Results) మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవ్వగా, వీరిలో 3,06,528 మంది పాస్ అయ్యారు. సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 78 గా ఉంది. ఒకేషనల్ కోర్స్ ఫస్టియర్ పరీక్షకు 38,483 మంది రాయగా, 23,181 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

 సెకండియర్ పరీక్షలకు 32,339 మంది విద్యార్థులు హాజరవ్వగా 23,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు బాలురు 2,26,240 మంది హాజరవ్వగా, 1,43,688 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 64 శాతం. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు బాలికలు 2,35,033 మంది హాజరవ్వగా... 1,67,187 మంది పాస్ అయ్యారు. 71 శాతం ఉత్తీర్ణత. ఈ ఏడాదీ బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 1,88,849 మంది బాలురు హాజరవ్వగా... 1,44,465 మంది పాస్ అయ్యారు. 75 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 2,04,908 మంది హాజరవ్వగా... 1,65,063 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 81 శాతం. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.

Fri, 12 Apr 202406:17 AM IST

AP Inter results 2024 live updates : ఈ ఏడాది బాలికలదే పై చేయి

ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఈ ఏడాదీ బాలికలదే పై చేయి అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఫలితాలతో విద్యార్థుల ఫ్యూచర్ ప్రభావితం కాదన్నారు. తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు మద్దతుగా నిలవాలని సూచించారు. ఫెయిల్ అని విద్యార్థులకు వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. సప్లమెంటరీ, మెయిన్ ఎగ్జామ్స్‌కు ఎలాంటి తేడాలు ఉండవని తెలిపారు.

Fri, 12 Apr 202406:01 AM IST

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

 ఇంటర్ విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 18 నుంచి 24 ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ(APSupplementary Exams Dates), ఇంప్రూమెంట్ విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. పరీక్షల వివరాలు త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

Fri, 12 Apr 202405:49 AM IST

AP Inter Results 2024 out : అగ్రస్థానంలో కృష్ణా, ఉత్తీర్ణత శాతాలు ఇవే

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి, కన్వీనర్ విడుదల చేశారు. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 81 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా 79 శాతం మూడో స్థానంలో ఉంది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు 87 , ఎన్టీఆర్ 87 రెండో స్థానంలో ఉన్నాయి. 84 శాతంతో విశాఖ మూడో స్థానంలో ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో అల్లూరు జిల్లా 48 శాతంలో చివరి స్థానంలో ఉండగా, సెకండియర్ 63 శాతం చిత్తూరు చివరిస్థానంలో ఉన్నాయి.

Fri, 12 Apr 202405:39 AM IST

AP Inter Resutls 2024 Live : ఇంటర్ ఫస్టియర్ 67 శాతం, సెకండియర్ 78 శాతం ఉత్తీర్ణత

 ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి, కన్వీనర్ విడుదల చేశారు. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 84 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది.

Fri, 12 Apr 202405:31 AM IST

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ అధికారులు విజయవాడలో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.

Fri, 12 Apr 202405:22 AM IST

AP Inter results 2024 live updates: సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ

ఏపీ ఇంటర్ ఫలితాల అనంతరం... సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు ప్రకటిస్తుంది. ఫెయిల్ అయిన విద్యార్థులుఉత్తీర్ణత సాధించడానికి ఇంటర్ బోర్డు మరొక అవకాశం ఉంటుంది. కాసేపట్లో సప్లిమెంటరీ పరీక్షల పూర్తి వివరాలు తెలియజేస్తాము.

Fri, 12 Apr 202405:17 AM IST

AP Inter results 2024 live updates : మార్క్ షీట్ లో మీ వివరాలు

సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఏపీ ఇంటర్ ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్ సైట్ నుంచి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థి పేరు, గ్రూప్, తల్లిదండ్రుల పేరు, మార్కులు, ఇతర వివరాలతో సహా మార్క్‌షీట్‌లో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. వివరాలతో ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే, మార్పులు చేయడానికి సహాయం కోసం విద్యార్థులు మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి.

Fri, 12 Apr 202405:18 AM IST

AP Inter Results 2024 Live : ఇంటర్ విద్యార్థుల గ్రేడ్ వివరాలు

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు A గ్రేడ్ పొందడానికి ఒక సబ్జెక్ట్‌లో కనీసం 81 మార్కులు సాధించాలి.

A1 : 91-100 మార్కుల

A2 : 81-90 మార్కులు

B1: 71-80 మార్కులు

B2: 61-70 మార్కులు

C1: 51-60 మార్కులు

C2: 41-50 మార్కులు.

Fri, 12 Apr 202404:40 AM IST

ఏపీ ఇంటర్ రిజల్ట్స్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేయండి

Fri, 12 Apr 202404:34 AM IST

AP Inter Results 2024 Live : మరో గంటలో ఇంటర్ ఫలితాలు

 మరో గంటలో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల కోసం 10 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలో ఏపీ ఇంటర్ బోర్డు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Fri, 12 Apr 202404:09 AM IST

AP Inter Results 2024 Live : ఏపీ ఇంటర్ ఫలితాల లింక్స్ ఇవే 

ఇంటర్ 1st ఇయర్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result-2024

 

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result-2024

 

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2024 

https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result 

 

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్ 2024 

https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-first-year-voc-result-2024

 

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్ 2024 

https://telugu.hindustantimes.com/voc-board-inter-second-year-voc-result-2024

Fri, 12 Apr 202403:54 AM IST

AP Inter Results 2024 Live : గతేడాది ఫలితాలు ఇలా

 గతేడాది ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 26న విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 2023 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో 2,66,326 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 61 శాతం పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలలో 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాస్ పర్సంటేజ్ 72 శాతం.

Fri, 12 Apr 202403:49 AM IST

ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ ఇక్కడ చూడండి

ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ ఇక్కడ చూడండి https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result-2024

Fri, 12 Apr 202403:36 AM IST

ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ ఇక్కడ తెలుసుకోండి

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result-2024

Fri, 12 Apr 202403:22 AM IST

ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 : ఇంటర్ మార్క్ షీట్ లో వివరాలు ఇలా

ఇంటర్ ఫలితాలు మార్క్‌షీట్‌లో... విద్యార్థి పేరు, ఇంటర్ హాల్ టికెట్ నంబర్, విద్యార్థి మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్‌లు, ఫలితాల స్థితి ఇతర అదనపు వివరాలు ఉంటాయి.

Fri, 12 Apr 202402:30 AM IST

కనీస అర్హత మార్కులు 33

 AP Inter Results 2024 Live : BIEAP ప్రకారం ఇంటర్ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు (కనీస అర్హత మార్కులు) స్కోర్ చేయాల్సి ఉంటుంంది.

Fri, 12 Apr 202401:50 AM IST

హెచ్.టి.తెలుగులో ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాలను హెచ్.టి.తెలుగులో లింక్ https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result ద్వారా తెలుసుకోవచ్చు.

Fri, 12 Apr 202401:19 AM IST

22 రోజుల్లోనే ఇంటర్ ఫలితాలు

విడుదల ఏపీ ఇంటర్ పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలోనే ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఫలితాలు ప్రకటిస్తుంది. ఈ మేరకు ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఫలితాలను విడుదల చేస్తుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.

Fri, 12 Apr 202401:05 AM IST

మరి కొన్ని గంటల్లో ఇంటర్ ఫలితాలు

ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. సుమారు 10 లక్షల విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాలను హెచ్.టి.తెలుగులో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ లింక్ లో ఇంటర్ ఫలితాలను https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.