AP Inter Results 2024 Out : ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల, మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
AP Inter Results 2024 Out : ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఈ లింక్ లో https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result చెక్ చేసుకోండి.
AP Inter Results 2024 Out : ఏపీ ఇంటర్ ఫలితాలను (AP Inter Results Out )బోర్డు అధికారులు విడుదల చేశారు. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఫలితాలు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు హెచ్.టి. తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
కృష్ణా టాప్, ఉత్తీర్ణత శాతాలు
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి, కన్వీనర్ విడుదల చేశారు. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 81 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా 79 శాతం మూడో స్థానంలో ఉంది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు 87 , ఎన్టీఆర్ 87 రెండో స్థానంలో ఉన్నాయి. 84 శాతంతో విశాఖ మూడో స్థానంలో ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో అల్లూరు జిల్లా 48 శాతంలో చివరి స్థానంలో ఉండగా, సెకండియర్ 63 శాతం చిత్తూరు చివరిస్థానంలో ఉన్నాయి.
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 18 నుంచి 24 ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ(AP Supplementary Exams Dates), ఇంప్రూమెంట్ విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. పరీక్షల వివరాలు త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది బాలికలదే పై చేయి
ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఈ ఏడాదీ బాలికలదే పై చేయి అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఫలితాలతో విద్యార్థుల ఫ్యూచర్ ప్రభావితం కాదన్నారు. తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు మద్దతుగా నిలవాలని సూచించారు. ఫెయిల్ అని విద్యార్థులకు వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. సప్లమెంటరీ, మెయిన్ ఎగ్జామ్స్‌కు ఎలాంటి తేడాలు ఉండవని తెలిపారు.
ఉత్తీర్ణత వివరాలు ఇలా?
ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు(AP Inter 1st Year Results) మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 67 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు(AP Inter 2nd Year Results) మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవ్వగా, వీరిలో 3,06,528 మంది పాస్ అయ్యారు. సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 78 గా ఉంది. ఒకేషనల్ కోర్స్ ఫస్టియర్ పరీక్షకు 38,483 మంది రాయగా, 23,181 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండియర్ పరీక్షలకు 32,339 మంది విద్యార్థులు హాజరవ్వగా 23,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు బాలురు 2,26,240 మంది హాజరవ్వగా, 1,43,688 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 64 శాతం. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు బాలికలు 2,35,033 మంది హాజరవ్వగా... 1,67,187 మంది పాస్ అయ్యారు. 71 శాతం ఉత్తీర్ణత. ఈ ఏడాదీ బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 1,88,849 మంది బాలురు హాజరవ్వగా... 1,44,465 మంది పాస్ అయ్యారు. 75 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 2,04,908 మంది హాజరవ్వగా... 1,65,063 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 81 శాతం. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.
- ఏపీ ఇంటర్ 1st ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result-2024
- ఏపీ ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result-2024
- ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2024
https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result
- ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్ 2024
https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-first-year-voc-result-2024
- ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్ 2024
https://telugu.hindustantimes.com/voc-board-inter-second-year-voc-result-2024
సంబంధిత కథనం