AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే!
AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను ఈ కింది లింక్స్ లో పొందవచ్చు.
AP Inter Results 2024 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు(AP Inter Results 2024) విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్స్ లో(AP Inter Results Links) విద్యార్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఉత్తీర్ణత శాతం ఇలా
ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు(AP Inter Exams) నిర్వహించారు. ఈనెల 4వ తేదీకి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ఇంటర్ ఫస్టియర్ కు సంబంధించి 5,17,617, సెకండియర్ 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయిలు 64 శాతం మంది, సెకండియర్ అబ్బాయిలు 75 శాతం మంది పాస్ అయ్యారు. అమ్మాయిలు ఫస్టియర్ 71 శాతం మంది, సెకండియర్ 81 శాతం మంది పాసయ్యారు.
HT తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఏపీ ఇంటర్ పరీక్షల(AP Inter Exams 2024) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు.
- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేయాలి.
- లింక్ ఓపెన్ చేయగానే… ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒకేషన్ రిజల్ట్స్ 2024 అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీరు పరీక్ష రాసిన లింక్ పై క్లిక్ చేసి మీ రూల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
- Submit బటన్ పై నొక్కితే మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష (AP Inter Exams) రాసిన విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషన్ ఫలితాల లింక్ ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.