AP Inter Results 2024: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ - ఈ డైరెక్ట్ లింక్‌లో మార్కులు చెక్ చేసుకోండి-ap inter results 2024 can be checked with these direct links ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Results 2024: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ - ఈ డైరెక్ట్ లింక్‌లో మార్కులు చెక్ చేసుకోండి

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ - ఈ డైరెక్ట్ లింక్‌లో మార్కులు చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 12, 2024 10:09 AM IST

AP inter results 2024 link: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు (ap bieap) సైట్ తో పాటు హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ ఫలితాలు - 2024
ఏపీ ఇంటర్ ఫలితాలు - 2024

ap inter results 2024 link: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results 2024) ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. కింద చూపిన బాక్స్‌లో మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

HT తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు…

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు(AP Inter Exams 2024) రాసిన ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి…

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలను 1559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 10,52,221మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరయ్యారు. తక్కువ సమయంలోనే స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేసిన అధికారులు…. ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

రెగ్యూలర్ కోర్సులతో పాటు ఒకేషనల్ ఫలితాలన్నీ ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధిాకారిక వెబ్ సైట్ తో పాటు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు.

How to Check AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష (AP Inter Exams) రాసిన విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోంపేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషన్ ఫలితాల లింక్ ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Whats_app_banner