AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ తేదీన విడుదల!-vijayawada ap intermediate results 2024 may declared on april 12th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ తేదీన విడుదల!

AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ తేదీన విడుదల!

Bandaru Satyaprasad HT Telugu
Apr 10, 2024 09:56 PM IST

AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తైంది. ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ తేదీన విడుదల!
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ తేదీన విడుదల!

AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలను(AP Inter Results 2024) స్పష్టత వచ్చింది. ఈ నెల 12న ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తుంది. ముందుగా ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తారమని సమాచారం రాగా, తాజాగా 12న ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మూల్యాంకనాన్ని మరోసారి పరిశీలించి ఫలితాలు(AP Intermediate) విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు(AP Inter Exams) హాజరయ్యారు.

ఏప్రిల్ 12న ఫలితాలు?

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఫలితాల విడుదల విద్యాశాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మార్చి నెలలోనే ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇప్పటికే ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏప్రిల్ 12న ఇంటర్ ఫస్టియర్AP Inter 1st Year Results), సెకండియర్ ఫలితాలను(AP Inter 2nd Year Results) ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం ఇంటర్ విద్యార్థులు https://bieap.apcfss.in/Index.do లో చెక్ చేసుకోవచ్చు.

గతేడాది కంటే ముందుగా

ఇంటర్‌ ఫలితాల (AP Inter Results 2024)కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులపై ఎన్నికల ప్రభావం ఉండకుండా, ఎన్నికలకు ముందే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉండటంతో ఫలితాల వెల్లడిపై ఈసీ ఆమోదం తప్పనిసరి. దీంతో విద్యాశాఖ ఈ మేరకు ఈసీ ఆమోదం కోరినట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదలతో రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు కాబట్టి...ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేయనున్నారు. గత ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 26న విడుదల చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 23 వేల మంది అధ్యాపకులను ఇంటర్‌ బోర్డు వినియోగించింది. ఇప్పటికే ఇంటర్ స్పాట్‌ వాల్యూయేషన్ ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఏపీ ఇంటర్ ఫలితాల(AP Inter Results) కోసం ఇలా చెక్ చేయండి

Step 1 : విద్యార్థులు bie.ap.gov.inలో BIEAP అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

Step 2 : హోమ్ పేజీలో AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.

Step 3 : లాగిన్ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

Step 4 : అభ్యర్థి ఫలితాలను స్క్రీన్‌పై చూడవచ్చు.

Step 5 : మీ రిజెల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి, భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం