తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Criminal Cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Sharath Chitturi HT Telugu

05 May 2024, 15:45 IST

  • ADR report on Lok Sabha elections phase 4 : క్రిమినల్​ కేసులున్న అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపే విషయంలోనూ చంద్రబాబు నాయుడు టీడీపీ- జగన్​ మోహన్​ రెడ్డి వైసీపీ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీడీపీ- వైసీపీ క్రిమినల్​ కేసులున్న అభ్యర్థులు ఎంత మందిం అంటే..
టీడీపీ- వైసీపీ క్రిమినల్​ కేసులున్న అభ్యర్థులు ఎంత మందిం అంటే..

టీడీపీ- వైసీపీ క్రిమినల్​ కేసులున్న అభ్యర్థులు ఎంత మందిం అంటే..

candidates with criminal records : 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో.. క్రిమినల్​ కేసులు ఉన్న అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి, ప్రకటిస్తోంది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​ (ఏడీఆర్​). ఇక ఇప్పుడు.. ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణాతో సహా ఇతర ప్రాంతాల్లో జరగనున్న 4వ దశ పోలింగ్​కి సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఏపీలో అధికారం కోసమే కాకుండా.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపే విషయంలోనూ చంద్రబాబు నాయుడు టీడీపీ- జగన్​ మోహన్​ రెడ్డి వైసీపీ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది!

2024 లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​..

ఏడీఆర్​ నివేదిక ప్రకారం.. మే 13న జరగనున్న లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వీరిలో 1,710 మంది అఫిడవిట్​లను విశ్లేషించగా.. 360మందిపై క్రిమినల్​ కేసులున్నాయని తేలింది. అంటే అది 21శాతం! ఇక 274 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఇది 16శాతం. 11 మందిపై మర్డర్​ కేసులు, 50మందిపై రేప్​ సహా మహిళలపై వేధింపులు కేసులు, 44మందిపై విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులున్నాయి.

పార్టీల వారీగా చూస్తే.. బీజేపీకి చెందిన 70మంది అభ్యర్థుల్లో 40 మంది (57శాతం)పై క్రిమినల్​ కేసులున్నాయి. కాంగ్రెస్​కు చందిన 61 మందిలో 35 (57శాతం) మందిపై క్రిమినల్​ కేసులు ఫైల్​ అయ్​యాయి. ఏఐఎంఐఎం విషయంలో.. పోటీ చేస్తున్న ముగ్గురు ఎంపీ అభ్యర్థులపైనా(100శాతం) కేసులుండం గమనార్హం.

Candidates with criminal records in Phase 4 polling : ఇక ఆర్​జేడీ తరఫున బరిలో దిగిన నలుగురిలో ఇద్దరిపై (50శాతం), శివసేనకు చెందిన నలుగురిలో ఇద్దరిపై (50శాతం), సమాజ్​వాదీ పార్టీకి చెందిన 19 మందిలో ఏడుగురి (37శాతం)పై, బీజేడీకి చెందిన నలుగురిలో ఇద్దరిపై (50శాతం) నేరరాపణలు ఉన్నాయి.

టీఎంసీకి చెందిన 8మంది ఎంపీ అభ్యర్థుల్లో ముగ్గురిపై క్రిమినల్​ కేసులున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. బీఆర్​ఎస్​ నుంచి 17 స్థానాల్లో బరిలో దిగిన ఎంపీ అభ్యర్థుల్లోని 10 మంది, అంటే 59శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. అటు.. ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ నిలబెట్టిన 17మంది ఎంపీ అభ్యర్థుల్లో 9మంది, అంటే 53శాతం మంది అభ్యర్థులపై.. వైసీపీ నిలబెట్టిన 25 మందిలో 12మంది అభ్యర్థులు, అంటే 48శాతం మందిపై క్రిమినల్​ కేసులున్నాయి.

ఏ నియోజకవర్గంలోనైనా.. నేర చరిత్ర, క్రిమినల్​ కేసులు కలిగి ఉన్న ముగ్గురు లేదా అంతకన్న ఎక్కువ మంది పోటీ చేస్తుంటే, ఆయా చోట్ల రెడ్​ అలర్ట్​ డిక్లేర్​ చేస్తారు. ఈసారి.. 96 నియోజకవర్గాల్లోని 58 చోట్ల (60శాతం) రెడ్​ అలర్ట్​ ఇచ్చారు.

TDP candidates with criminal records : ఇక ఆర్థికపరమైన విషయాలకొస్తే.. 2024 లోక్​సభ ఎన్నికల 4వ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తి విలువు రూ. 11.72 కోట్లు. యావరేజ్​ అసెట్​ పర్​ కాండిడేట్​ రూ. 101.77 కోట్లుగా ఉన్న బీజేపీ అభ్యర్థులు 70మంది ఉన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ. 23.65 కోట్లు.

ఇక అభ్యర్థుల ఆస్తి విషయంలోనూ తెలుగు రాష్ట్రాలు టాప్​లో ఉన్నాయి. టీడీపీకి చెందిన చంద్రశేఖర్​ పెమ్మసామి ఆస్తి విలువు రూ. 5,705 కోట్ల కన్నా ఎక్కువే! ఆ తర్వాతి స్థానంలో.. తెలంగాణా బీజేపీ చేవెళ్ల అభ్యర్థి విశ్వేశ్వర్​ రెడ్డి ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ. 4,568 కోట్ల కన్నా ఎక్కువే!

4వ దశ పోలింగ్​లో మొత్తం మీద 10శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే.. 170 మంది మహిళలు ఎన్నికల బరిలో దిగుతున్నారు.

తదుపరి వ్యాసం