Lok Sabha Elections in Telangana : తెలంగాణలో పోటీ చేస్తున్న పలువురి అభ్యర్థుల ఆస్తులు వంద కోట్లకు పైగా ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఆయా అభ్యర్థులు వారి కుటుంబ ఆస్తులతో కలిపి రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. ఇందులో స్థిర, చర ఆస్తులు ఉన్నాయి.
చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న రంజిత్ రెడ్డి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. మొత్తం రూ.435.33 కోట్లతో రెండో ధనవంతుడిగా నిలిచారు. అప్పులు రూ.23 కోట్లుగా ఉన్నాయి. ఆయన కుటుంబానికి రూ.294.33 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా, స్థిరాస్తుల విలువ రూ.141 కోట్లు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ కూడా అత్యధిక సంపద కలిగిన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి రిచెస్ట్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద రూ.228.46 కోట్లుగా ప్రకటించారు.
MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కె మాధవిలతా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న ఆమె ఆస్తులు… మొత్తం రూ.218.38 కోట్లుగా ఉన్నాయి. రూ.27 కోట్ల వరకు అప్పులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సమీర్ వలీవుల్లాను కాంగ్రెస్ పోటీకి దింపిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఒక స్థానంలో MIM గెలవగా.. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.