BRS Zahirabad : జహీరాబాద్ బరిలో గాలి అనిల్ కుమార్...? బీఆర్ఎస్ నుంచి సీటు ఖరారవుతుందా..!-gali anil kumar likely to contest as brs candidate from zahirabad constituency in loksabha polls 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Zahirabad : జహీరాబాద్ బరిలో గాలి అనిల్ కుమార్...? బీఆర్ఎస్ నుంచి సీటు ఖరారవుతుందా..!

BRS Zahirabad : జహీరాబాద్ బరిలో గాలి అనిల్ కుమార్...? బీఆర్ఎస్ నుంచి సీటు ఖరారవుతుందా..!

HT Telugu Desk HT Telugu
Mar 10, 2024 12:02 PM IST

Lok Sabha Elections 2024: సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి వెళ్లటంతో జహీరాబాద్ బీఆర్ఎస్ లో సమీకరణాలు మారిపోయాయి. త్వరలోనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో నాయకుడి కోసం బీఆర్ఎస్ చూస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలోకి వచ్చిన గాలి అనిల్ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

గాలి అనిల్ కుమార్
గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar FB)

Gali Anil Kumar: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar)ని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీచేసి గెలిసిన బీబీ పాటిల్ , వారం రోజుల కింద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరటం, బీజేపీ అధిష్టానం తననే తమ పార్టీ జహీరాబాద్(Zahirabad constituency) అభ్యర్థిగా ప్రకటించడంతో, బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గత లోక్ సభ ఎన్నికల్లో ఉన్నంత బలంగా లేకపోవడం, ఇప్పుడు తమ పార్టీ రాష్టంలో అధికారంలో లేకపోవడం, చాల మంది నాయకులూ జహీరాబాద్ నుండి పోటీచేయడానికి ఇష్టపడటం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

సరైన నేత లేకపోవటంతోనే….!

ఈ నియోజకవర్గంలో, పార్టీ కి చెప్పుకోదగ్గ నాయకులూ కూడా లేరు అని చెప్పొచ్చు. మెదక్ లోక్ సభ (Medak loksabha polls 2024)పరిధిలోని, పఠాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ ని ఇక్కడి పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుసుతుంది. ఇందులో భాగంగానే, గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్తకు ప్రమాదం జరిగితే… నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లి ఆ కార్యకర్తకు నాలుగు లక్షల ఆర్ధిక సహాయం చేసాడు. గాలి అనిల్ కుమార్, కాపు సామాజికవర్గానికి చెందిన వాడు కావడం, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాపు సంఘం నాయకులూ శనివారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు ను కలిసి తమ సామాజికవర్గానికి చెందిన నాయకునికి ఈ సారి జహీరాబాద్ లోక్ సభ సీటుని ఇవ్వాలని కోరారు. ఈ పరిణామాలన్నీ చూస్తే, జహీరాబాద్ నుండి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండ గాలి అనిల్ కుమార్ ని బరిలోకి దించనున్నదని తెలుస్తున్నది.

అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ లో చేరిన గాలి.......

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుండి పార్టీ పఠాన్ చెరువు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన, తనకు సీటు ఇవ్వకపోవడంతో అనిల్ కుమార్ 2018 అసెంబ్లీ ఎన్నికలో ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. కాంగ్రెస్ పార్టీ తరపున 2019 లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుండి పోటీచేసిన గాలి అనిల్ కుమార్ రెండో స్థానం తో సరిపెట్టుకున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుండి సీటు ఆశించిన గాలి అనిల్ కుమార్, తనకు టికెట్ రాకపోవడంతో మరొకసారి కాంగ్రెస్ పార్టీని వీడి, ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ లో చేరాడు. బీఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ లోక్ సభ స్థానాన్ని ఆశించిన గాలి అనిల్ కుమార్ కు, పార్టీ అధిష్టానం మాత్రం తనని జహీరాబాద్ నుండి పోటీచేయమని కోరినట్టు తెలుస్తుంది.

జహీరాబాద్ లోక్ సభ(Zahirabad Loksabha constituency) పరిధిలో, ఏడూ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . అందులో కామారెడ్డి, జహీరాబాద్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ ఓడిపోయిన మూడు నియోజకవర్గాల్లో, కామారెడ్డి బీజేపీ గెలుచుకోగా, జహీరాబాద్(Zahirabad constituency), బాన్సువాడ నియోజకవర్గాలను మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ల కూడా కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ముందే ప్రకటించి ఇంకా తన గెలుపు అవకాశాలను పెంచుకున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులూ అంటున్నారు. బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ని కాషాయ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం