తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం తెరపైకి వచ్చింది. ఏపీ సర్కార్ చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టే ఇందుకు కారణమైంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష భేటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే కృష్ణా, గోదావరి జలాల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి సరిగా లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.