తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వడ్డీ రేట్లు పెంచేసిన ఆర్బీఐ.. 4.40 శాతానికి పెంపు

వడ్డీ రేట్లు పెంచేసిన ఆర్బీఐ.. 4.40 శాతానికి పెంపు

HT Telugu Desk HT Telugu

04 May 2022, 14:39 IST

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని వెల్లడించింది. తన కీలక పాలసీ రేటును పెంచింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ తన షెడ్యూల్డ్ పాలసీ సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.40 శాతానికి పెంచాలని నిర్ణయించింది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (REUTERS)

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ బుధవారం బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 40 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచి 4.40 శాతానికి పెంచింది. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా గత రెండేళ్లుగా 4% కనిష్ట స్థాయిలో కొనసాగుతోంది. రెపో రేటు అంటే బ్యాంకులకు స్వల్పకాలిక నిధులను ఇచ్చేందుకు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

నిరంతర ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో మానిటరీ పాలసీ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, కోవిడ్ మహమ్మారి కారణంగా సప్లై చైన్ విఘాతం కారణంగా ఇంధనం, ఆహార ధరలలో పెరుగుదల ఆర్బీఐ ఈ సంవత్సరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. మార్చిలో ప్రధాన ద్రవ్యోల్బణం 17-నెలల గరిష్ఠ స్థాయి 6.95%కి పెరిగింది.  ఆర్బీఐ 2%-6% మధ్య మాత్రమే అంచనా వేసింది.

ద్రవ్యోల్బణం ఆందోళనలను ఉటంకిస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.40 శాతానికి పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ బుధవారం జరిగిన ఆకస్మిక సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించింది.

జనవరి నుంచి ద్రవ్యోల్బణం లక్ష్యం నిర్దేశిత 6 శాతం కంటే ఎక్కువగానే కొనసాగుతుండగా, ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.9 శాతంగా ఉంది.

ఆగస్టు 2018 తర్వాత ఆర్‌బీఐ తొలిసారిగా వడ్డీరేట్లను పెంచింది. ఎంపీసీ నిర్ణయం మే 2020 వడ్డీ రేటు తగ్గింపును సమాన మొత్తంలో వెనక్కి తీసుకుందని గవర్నర్ చెప్పారు.

సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ రెపో రేటును లేదా స్వల్పకాలిక రుణ రేటును మే 22, 2020న వడ్డీ రేటును చారిత్రాత్మకంగా 4 శాతానికి తగ్గించింది.

దాదాపు రెండేళ్ల పాటు కీలక పాలసీ రేట్లపై ఆర్‌బీఐ యథాతథ స్థితిని కొనసాగించింది. 

 

టాపిక్

తదుపరి వ్యాసం