తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Body Heat Reduce Tips : ఒంట్లో వేడి ఉందా? అయితే పోపుల పెట్టె తెరవాల్సిందే

Body Heat Reduce Tips : ఒంట్లో వేడి ఉందా? అయితే పోపుల పెట్టె తెరవాల్సిందే

HT Telugu Desk HT Telugu

17 April 2023, 8:00 IST

    • Summer Health Care Tips : ఎండ ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతోంది. చాలా మంది వేడితో బాధపడుతున్నారు. మీరు మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి ప్రయత్నించాలి.
పోపుల పెట్టె
పోపుల పెట్టె

పోపుల పెట్టె

శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి చాలా మంది పండ్లు(Fruits), జ్యూస్‌లు తీసుకుంటారు. అయితే మన పూర్వీకులు శరీరంలోని వేడిని తగ్గించేందుకు పోపుల పెట్టెలోని గింజలను ఉపయోగించేవారు. ఎందుకంటే ఈ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మీ రోజువారీ ఆహారం(Food)లో ఆ విత్తనాలను చేర్చవచ్చు. వాటిని మీ నోటిలో వేసుకుని నమలవచ్చు. లేదంటే నీటిలో నానబెట్టి తాగొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Chapati Flour : చపాతీ పిండిలో ఐస్ క్యూబ్స్ వేస్తే జరిగే విషయం తెలిస్తే ఇకపై అదే పని చేస్తారు

Beetroot Biryani: బీట్రూట్ బిర్యానీ ఇలా చేస్తే రుచికి రుచి ఎంతో ఆరోగ్యం

Salt Water Face Wash : ఉప్పు నీటిని ఇలా వాడితే మెుటిమలు, నల్లమచ్చలు శాశ్వతంగా మాయం

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో H అక్షరం దాక్కుంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి

వేసవిలో శరీరంలోని వేడి(Body heat)ని తగ్గించడంలో వంటగదిలోని ఏ విత్తనాలు సహాయపడతాయని మీరు అడగవచ్చు. శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడే కొన్ని విత్తనాలు కింద ఉన్నాయి. ఆ గింజలను తెలుసుకుని వేసవిలో రోజూ వాటిని తింటే శరీరం చల్లగా ఉంటుంది.

వంటగదిలో సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో జీలకర్ర(Cumin) ఒకటి. ఈ జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే వేసవిలో జీలకర్ర నీటి(Cumin Water)ని తాగితే శరీరం పొడిబారకుండా చేస్తుంది. వేడి సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపు సమస్యలతో బాధపడేవారికి జీలకర్ర నీరు చాలా మంచిది. వేసవిలో జీలకర్ర నీరు శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

పోపుల పెట్టెలో మరో ముఖ్యమైనది సోంపు. ఈ చిన్న గింజలో చాలా గుణాలు ఉన్నాయి. ఈ విత్తనాలలో విటమిన్ సి(Vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వేడి సంబంధిత గాయాలను నివారిస్తుంది. సాధారణంగా వేసవిలో చాలా మంది గుండెల్లో మంట, అజీర్ణంతో బాధపడుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే సోంపు గింజలను ఎప్పటికప్పుడు నోటిలో నమిలుతూ ఉండాలి.

బాడీ హీట్(Body heat) సమస్యతో బాధపడేవారు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక చెంచా మెంతులు(Fenugreek) తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. అంతే కాకుండా శరీరంలోని వేడి వల్ల వచ్చే దురదలు, పొక్కులు, అసౌకర్యాన్ని కూడా మెంతి తగ్గిస్తుంది. మెరుగైన ప్రయోజనాల కోసం, నిద్రపోయే ముందు నీటిలో మెంతి గింజలను నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగి, మెంతులు తినండి.

ధనియాలు(Coriander Seeds).. జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, శరీరంలోని వేడిని తగ్గించే శక్తి ఉంది. ధనియాలు రాత్రి నీళ్లలో నానబెట్టి, మరుసటి రోజు ఆ నీటిని తాగితే శరీర ఉష్ణోగ్రత వెంటనే తగ్గుతుంది.

శరీరాన్ని చల్లగా ఉంచడంలో తులసి గింజలు(Tulasi Seeds) ఎంతగానో సహకరిస్తాయి. కాబట్టి వేసవిలో అధిక శరీర వేడితో బాధపడేవారు తులసి గింజలను నీళ్లలో నానబెట్టి అందులో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది. అంతే కాకుండా, ఈ విత్తనాలు మలబద్ధకం, అసిడిటీ, చర్మ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

టాపిక్