తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో H అక్షరం దాక్కుంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో H అక్షరం దాక్కుంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu

10 May 2024, 9:00 IST

google News
    • Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. మరొక ఆప్టికల్ ఇల్యూషన్ తో మీ ముందుకు వచ్చాము. దీన్ని మీరు పది సెకన్లలో చేధించి చూపించాలి.
ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: ఆప్టికల్ ఇఎల్యూషన్లను ఏదో ఒక పజిల్ అనుకోకండి. ఇది మీ కాగ్నిటివ్, సైకలాజికల్ సామర్ధ్యాలకు సవాలు విసురుతుంది. మీ మెదడు విషయాలను గ్రహించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. సవాలుతో కూడిన చిక్కులను పూర్తిచేస్తే మీ తెలివితేటలు కూడా పెరుగుతాయి. మన మెదడు ఎలా పనిచేస్తుందో ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో అంతటా ఆంగ్ల అక్షరం N కనిపిస్తోంది. వాటి మధ్యలో H అనే అక్షరం ఇరుక్కుని ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టడమే మీ ముందున్న సవాలు.

ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కూడా కనిపెట్టేస్తారు. తెలివైన వారని నిరూపించుకోవడానికి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే ఇస్తున్నాము. ఈ 10 సెకన్లలో ఈ H అక్షరం ఎక్కడ ఉందో చూసి పట్టుకోవాలి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ను ఇంతవరకు కేవలం రెండు శాతం మంది వ్యక్తులు మాత్రమే చేధించగలిగారు. ఈ ప్రజలు సాధించేందుకు ఏకాగ్రత చాలా అవసరం. ముఖ్యంగా మెదడు, కంటిచూపు సమన్వయంతో పనిచేయాలి.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

పది సెకన్లలో H అక్షరాన్ని కనిపెట్టిన వారికి ధన్యవాదాలు. ఇక జవాబు విషయానికి వస్తే చివరి నుంచి మూడో నిలువ వరుసలో మూడో అక్షరమే జవాబు.

ఇలాంటి ఆప్టికల్ ఇల్ల్యూషన్లను తరచూ చేధిస్తూ ఉంటే విశ్లేషణాత్మక సామర్థ్యాలు మెరుగుపడతాయి. మన మెదడుకు మనకు తెలియకుండానే ఈ ఆప్టికల్ ఇల్యుషన్లు మంచి సాధనలా పనిచేస్తాయి. ఇది ఐక్యూను కూడా పరీక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ లో H అక్షరాన్ని కేవలం రెండు శాతం మంది మాత్రమే 10 సెకన్లలలో కనిపెట్టగలరు. మీరు కూడా ఆ రెండు శాతం మంది వ్యక్తుల్లో ఉంటే చాలా తెలివైనవారని అర్థం.

తదుపరి వ్యాసం