Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు-only the wise can figure out where the goatherds face is in the optical illusion given here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Haritha Chappa HT Telugu
May 03, 2024 09:30 AM IST

Optical Illusion: ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్ ఇచ్చాము. అందులో మేక కనిపిస్తోంది. అలాగే మేకల కాపరి ముఖం కూడా దాక్కుని. అది ఎక్కడుందో కనిపెట్టి చెప్పండి.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: ఇక్కడ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇది ఒక గమ్మత్తైన బ్రెయిన్ టీజర్. ఇందులో చెట్టు, మేక, గడ్డి...ఇలా అన్ని కనిపిస్తున్నాయి. మేకల యజమాని ముఖం కూడా ఈ చిత్రంలో ఉంది. అది ఎక్కడుందో కేవలం తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు. ఈ చిత్రాన్ని పరిశీలనగా చూస్తే ఆ మేకల యజమాని ముఖం దొరికిపోతుంది.

ఆ మేకల యజమాని ముఖం కనిపెట్టేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకోకండి. కేవలం 10 సెకన్లలోనే కనిపెట్టాలి. అప్పుడే మీరు చాలా తెలివైనవారని అర్థమవుతుంది. ఇది మీ మెదడుకు మంచి సవాలు విసురుతున్నాయి. ఈ చిత్రాన్ని పరిశీలనగా కాసేపు చూడండి. అతని ముఖం దొరికిపోతుంది.

జవాబు ఇదే

మేకల యజమాని ముఖాన్ని కనిపెట్టిన వారికి అభినందనలు. మీ పరిశీలనా నైపుణ్యాలు సూపర్ అని ఒప్పుకోవాల్సిందే. మీరు మంచి పజిల్ సాల్వర్ అవుతారు. మీ జీవితంలో ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక మేకల యజమాని ముఖాన్ని కనిపెట్టలేని వారి కోసం ఇక్కడ జవాబు ఇచ్చాము. మేక వెనుక భాగం, పక్కనున్న చెట్టు కలిపి చూడండి. అతని ముఖం మీకే కనిపిస్తుంది.

మేక తోక భాగం నుంచి చెట్టు వరకు ఉన్న ఆకారాన్ని గమనించండి.
మేక తోక భాగం నుంచి చెట్టు వరకు ఉన్న ఆకారాన్ని గమనించండి.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను చేధించడం వల్ల మానసికంగా చురుకుదనం పెరుగుతుంది. విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్ధ్యాలు మెరుగుపడతాయి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం కొత్తగా ఆలోచించటం మొదలు పెడతారు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను చేధించడానికి ఏకాగ్రత చాలా అవసరం. ఒత్తిడి నుండి బయటపడేందుకు కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఉపయోగపడతాయి.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు పిల్లల మెదడుకు చాలా అవసరం. సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ల హవా నడుస్తోంది. వీటిని సాధించడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండడం, పనిపై ఏకాగ్రత్త పెట్టడం వంటి లక్షణాలు పెరుగుతాయి.

ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర ఈనాటిది కాదు. ఇలా బ్రెయిన్ టీజర్లను వందల ఏళ్ల క్రితమే ప్రజలు వినోదాత్మకంగా వాడినట్టు తెలుస్తోంది. గ్రీకు దేశంలో ఉన్న పురాతన ఆలయాలపై ఉన్న బొమ్మలను బట్టి ఆప్టికల్ ఇల్యూషన్లు ఎప్పటి నుంచో వాడుకలతో ఉన్నట్టు అర్థమవుతోంది.

Whats_app_banner