Ramphal Fruit Benefits । సీతాఫలం కంటే గింజలు తక్కువ, పోషకాలు ఎక్కువ.. రామాఫలంతో ప్రయోజనాలు ఇవే!-diabetes cure to heart health know amazing health benefits of ramphal fruit or wild sweetsop ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ramphal Fruit Benefits । సీతాఫలం కంటే గింజలు తక్కువ, పోషకాలు ఎక్కువ.. రామాఫలంతో ప్రయోజనాలు ఇవే!

Ramphal Fruit Benefits । సీతాఫలం కంటే గింజలు తక్కువ, పోషకాలు ఎక్కువ.. రామాఫలంతో ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jan 29, 2023 12:33 PM IST

Ramphal Fruit Health Benefits: రామాఫలం స్థానికంగా కూడా లభించే అద్భుతమైన పండు. సీతాఫలం కంటే తక్కువ గింజలు, ఎక్కువ పోషకాలను కలిగి ఉండే ఈ పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

Ramphal Fruit Health Benefits
Ramphal Fruit Health Benefits (Unsplash)

మనందరికీ సీతాఫలం గురించి బాగా తెలుసు, మరి రామాఫలం గురించి తెలుసా? ఈ సీజన్‌లో లభించే వివిధ రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లలో రామాఫలం కూడా ఒకటి, దీనిని రాంఫల్ లేదా రామఫలం అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు చూడటానికి లేత ఎరుగు రంగులో, ఆకు పచ్చ రంగులో ఉంటాయి. ఇది కూడా సీతాఫలం జాతికి చెందిన పండు, అయినప్పటికీ సీతాఫలం కంటే పోషక విలువలు ఎక్కువ, గింజలు తక్కువ కలిగి ఉన్న పండు ఇది.

రామాఫలంను జ్యూస్ చేసుకొని తాగితే అలిసిపోయిన శరీరం కూడా ఉత్తేజం అయ్యేంత శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండటం ఈ తక్షణ శక్తికి మూలం. ఈ పండులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడుతుంది.

Ramphal Fruit Health Benefits - రామాఫలం ఆరోగ్య ప్రయోజనాలు

మధుమేహాన్ని నయం చేయడం నుంచి, రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1. మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది

మధుమేహ వ్యాధిగ్రస్తులకు, ముఖ్యంగా పండ్ల విషయానికి వస్తే, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది నిరంతర పోరాటం. మధుమేహులు రామాఫలంను నిరభ్యంతరంగా తినవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్-తగ్గించే గుణాలను కలిగి ఉన్నందున మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు తినడం ద్వారా డయాబెటిస్‌ రాకుండా రక్షణ కల్పించగలదు.

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మెరుగైన రోగనిరోధక శక్తిని పొందడం కోసం రామఫలం కచ్చితంగా తినాలి. ఇది కాలానుగుణ మార్పుల కారణంగా ఏర్పడే ఎలాంటి అనారోగ్యంతో పోరాడటానికైనా సహాయపడుతుంది. ఈ పండులో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్ ఎ, వాపును తగ్గించడంలో సహాయపడే విటమిన్ బి కూడా ఇందులో ఉన్నాయి.

3. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం

కీళ్ల నొప్పులతో బాధపడే వారికి రామ ఫలం ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇలా రామ పండు కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది

4. చర్మానికి మంచిది

వృద్ధాప్య సంకేతాలను దూరం చేయడానికి, మొటిమలను నివారించేందుకు రామఫల తింటే ప్రయోజనం ఉంటుంది. మీ వయసు 30 ఏళ్ల పైబడి ఉంటే, ముఖంపై మొటిమల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ పండును తింటూ ఉండండి, ముఖంపై మొటిమలు పోయి ముఖంలో కొత్త మెరుపును తిరిగి తీసుకురావడంలో సహాయం చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ పండు మేలు చేస్తుంది.

5. గుండెకు మంచిది

రామఫలంలో విటమిన్ బి6 మంచి మోతాదులో ఉంటుంది, ఈ పోషకం గుండె దగ్గర కొవ్వు పేరుకుపోకుండా నియంత్రిస్తుంది కాబట్టి గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి రామఫలం తింటూ ఉండాలి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రక్తహీనతకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది, శరీర కణాలకు ఆక్సిజన్‌ రవాణా సక్రమంగా జరుగుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం